Last Updated:

Prashant Kishor: జగన్ కు సాయం చేసి తప్పుచేశా.. ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు

రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ కి సాయం చేసి తప్పు చేశానని, ఆ సమయంలో తాను కాంగ్రెస్ కి సాయం చేసి ఉండాల్సిందని పేర్కొన్నారు.

Prashant Kishor: జగన్ కు సాయం చేసి తప్పుచేశా.. ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు

Prashant Kishor: రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ కి సాయం చేసి తప్పు చేశానని, ఆ సమయంలో తాను కాంగ్రెస్ కి సాయం చేసి ఉండాల్సిందని పేర్కొన్నారు.

కాంగ్రెస్ ని బతికించాల్సిన అవసరం ఈ దేశంలోని ప్రతి ఒక్క పౌరునిపై ఉందన్నారు రాజకీయ వ్యూహకర్త  ప్రశాంత్ కిషోర్. ఈ సందర్భంగా ఆయన బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ కలయికను కాఫీతో పోల్చారు. కాఫీ కప్పు చూసినపుడు అందులో నురుగు పైన ఉంటుంది. అది బీజేపీ అయితే కింద ఉన్న కాఫీ ఆర్ఎస్ఎస్ అని తెలిపారు. ఆర్ఎస్ఎస్ ను ఏమీ చేయకుండా నురుగు గురించి ఆలోచిస్తే ఏమీ ఉపయోగం ఉండదంటూ తనదైన స్టైల్లో విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు.

బిహార్‌లో 3,500 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చేస్తున్న పీకే ఆదివారం పశ్చిమ చంపారన్‌ జిల్లా లౌరియాలో పర్యటిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. మోదీ నేతృత్వంలోని కమలదళాన్ని అడ్డుకోవడంలో విపక్షాల కూటమి సమర్థతపై ఆయన అనుమానాలు వ్యక్తంచేశారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) ఇప్పుడు ప్రజల్లోకి, సామాజిక నిర్మాణంలోకి ప్రవేశించిందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. దానిని ఇప్పుడు షార్ట్‌కట్‌లతో కొట్టడం సాధ్యం కాదు” అంటూ కిషోర్ అన్నారు. “నాథూరామ్ యొక్క భావజాలం గ్రహించడానికి తనకు చాలా సమయం పట్టిందని, గాంధీ కాంగ్రెస్‌ను పునరుద్ధరించడం ద్వారా మాత్రమే గాడ్సేను ఓడించగలం” మంటూ పేర్కొన్నారు. నేను బిహార్ సీఎం నితీష్ కుమారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ వంటి వారికి సహాయం చేసే బదులు కాంగ్రెస్ ను బతికించే దిశగా పనిచేస్తే బాగుండేది అని ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యానించారు. వీరిద్దరికీ పనిచేయడం టైం వేస్ట్ తప్ప ఏం ఉపయోగం లేదన్నారని విమర్శించారు. నా టార్గెట్ ఇప్పుడు బీజేపీనే అని బీజేపీని ఓడించాలంటే కాంగ్రెస్ ను బతికించాల్సిన అవసరం ఉందని తెలిపారు. బీజేపీ అంటే ఏమిటో అర్థం చేసుకోలేకపోతే దాన్ని ఓడించలేమని ఉద్ఘాటించారు.

ఇదీ చదవండి: భాజపా ర్యాలీ, తెరాస డీజే.. ఇంకేముంది అంతా రచ్చరచ్చే..!

ఇవి కూడా చదవండి: