Site icon Prime9

Abhinay Tej: అంగరంగ వైభవంగా అభినయ్ తేజ్ వివాహ మహోత్సవం

Abhinay Tej Wedding: పరుచూరి రామకోటేశ్వరరావు, కొత్తపల్లి గీత దంపతుల కుమారుడు అభినయ్ తేజ్.. మాధవి, కోటపాటి సీతారామరావు కూతురు అక్షత వివాహ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహ వేడుక హైదరాబాద్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్ హాల్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు కేంద్ర, రాష్ట్ర మంత్రులతోపాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.

ఈ వివాహ వేడుక డిసెంబర్ 25న బుధవారం రాత్రి 12.37 గంటలకు జరిగింది. ఈ మేరకు అభినయ్ తేజ్, అక్షత వేదమంత్రాల సమక్షంలో వైవాహ జీవితంలోకి అడుగుపెట్టారు. ఇదిలా ఉండగా.. అభియన్ తేజ్, అక్షత వివాహ వేడుకకు ముఖ్య అతిథులుగా కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ హాజరై వధూవరులను ఆశీర్వదించారు.

అలాగే ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్, రాజమండ్రి అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ ఛైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, ఎంపీ పురంధేశ్వరి, విశాఖ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, జీసీసీ ఛైర్మన్ శ్రవణ్ కుమార్, మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, బీజేపీ నాయకులు లక్ష్మణ్, రచయిత, ఎంపీ విజయేంద్రప్రసాద్, యాక్టర్స్ వడ్డే నవీన్, తరుణ్, శ్రీకాంత్, నవీన్ చంద్ర, శివ బాలాజీ, డైరెక్టర్స్ దశరథ్, హరీశ్ శంకర్, తదితరులు పాల్గొన్నారు. అనంతరం నూతన వధూవరులను ఆశీర్వాదం తెలిపి బహుమతులు అందజేశారు.

Exit mobile version
Skip to toolbar