Robinhood: నితిన్‌ ‘రాబిన్‌ హుడ్‌’ వాయిదా – అధికారిక ప్రకటన ఇచ్చిన మేకర్స్‌

  • Written By:
  • Updated On - December 17, 2024 / 01:43 PM IST

Nithin Robinhood Postponed: నితిన్‌ హీరోగా యంగ్‌ సెన్సేషన్‌ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్న సినిమా ‘రాబిన్‌ హుడ్‌’. వెంకీ కుడుముల దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. భీష్మ వంటి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ తర్వాత వీరిద్దరి కాంబోవస్తున్న చిత్రమిది. దీంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్‌, సాంగ్స్‌, టీజర్‌ మూవీ మంచి బజ్‌ క్రియేట్‌ చేశాయి. అయితే తాజాగా ఈ మూవీ రిలీజ్‌ డేట్‌ వాయిదా వేస్తున్నట్టు మేకర్స్‌ ఓ ప్రకటన ఇచ్చారు.

మొదట డిసెంబర్‌ 25న క్రిస్మస్‌ సందర్భంగా ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేస్తున్నట్టు మూవీ టీం ప్రకటించింది. కానీ తాజాగా ఈ సినిమాను వాయిదా వేస్తున్నట్టు మైత్రీ మూవీ మేకర్స్‌ ప్రకటించారు. “అనుకోని కారణాల వల్ల మా చిత్రం రాబిన్‌ హుడ్‌ను డిసెంబర్‌ 25న రిలీజ్‌ చేయలేకపోతున్నాం. త్వరలోనే కొత్త రిలీజ్‌ డేట్‌ని ప్రకటిస్తాం. అప్పటి వరకు వేయిట్‌ చేయండి” అంటూ మైత్రీ మూవీ మేకర్స్‌ ప్రకటన ఇచ్చింది. దీంతో ఈ క్రిస్మస్‌ పండగ రేసు నుంచి మూవీ తప్పుకుంది.