Site icon Prime9

Good News for gurukula students: గురుకుల విద్యార్థులకు శుభవార్త.. భీమ్ ప్రాజెక్టుతో అత్యుత్తమ వైద్యం

Minister announcement for gurukula students medical treatment: గురుకుల విద్యార్థులకు భీమ్ ప్రాజెక్టుతో అత్యుత్తమ వైద్యం అందిస్తామని మంత్రి బాల వీరాంజనేయస్వామి ప్రకటించారు. విద్యార్థుల ఆరోగ్య పర్యవేక్షణకు జిల్లాకు ఒక డాక్టర్‌ను నియమించామన్నారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండలో ఎస్సీ, బీసీ వసతి గృహాలను మంత్రి తనిఖీ చేశారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

గురుకులాల కోసం 15రకాల పరికరాలతో హెల్త్ కిట్లు తెస్తున్నామన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రూ.143 కోట్లతో హాస్టళ్లలో మరమ్మతులు చేస్తున్నామని తెలిపారు. రూ.206 కోట్లతో 62కొత్త హాస్టళ్లు నిర్మిస్తున్నట్లు చెప్పారు. అనారోగ్యానికి గురై ప్రాణాపాయ స్థితిలో ఉన్న 10మంది విద్యార్థులకు కార్పొరేట్ వైద్యం అందించి ప్రాణాలు కాపాడామని తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

Exit mobile version