Mariamma Murder Case updates 34 members arrest: దళిత మహిళ మరియమ్మ హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మరియమ్మ హత్య కేసులో 34 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇప్పటికే వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన సంగతి తెలిసిందే. తాజాగా, ఈ కేసులో మరో 34 మందిని తుళ్లూరు పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం 34 మందిని మంగళగిరి కోర్టులో హాజరుపర్చారు.
ఇదిలా ఉండగా, మరియమ్మ హత్య కేసు నిందితుడు, వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ కేసులో చార్జ్‌షీట్ దాఖలు చేసే వరకు జోక్యం చేసుకోమని స్పష్టం చేసింది. అంతకుముందు ఈ కేసు తదిపరి విచారణను జనవిరి 7కి వాయిదా వేసింది. కాగా, 2020 డిసెంబర్ 27న మరియమ్మ హత్యకు గురైంది.