Last Updated:

Sullurpet: శాటిలైట్ పట్టణంలో బెంబేలెత్తిస్తున్న బురద రోడ్లు.. పట్టించుకోని ప్రభుత్వం

దేశానికి అంతర్జాతీయంగా పేరు తీసుకొచ్చిన కొన్ని ప్రాంతాలకు ఆ పట్టణం ఓ ల్యాండ్ మార్క్.. అక్కడి పురపాలక సంఘంలో అడుగు భూమి కొనాలంటే ఆకాశాన్నంటే ధరలు, కాని నేటి ప్రభుత్వ పాలనలో పేరుగొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా మారి పట్టణంలోని కొన్ని ప్రాంతాలు కళావిహీనంగా తయారైనాయి.

Sullurpet: శాటిలైట్ పట్టణంలో బెంబేలెత్తిస్తున్న బురద రోడ్లు.. పట్టించుకోని ప్రభుత్వం

Andhra Pradesh: దేశానికి అంతర్జాతీయంగా పేరు తీసుకొచ్చిన కొన్ని ప్రాంతాలకు ఆ పట్టణం ఓ ల్యాండ్ మార్క్. అక్కడి పురపాలక సంఘంలో అడుగు భూమి కొనాలంటే ఆకాశాన్నంటే ధరలు. కాని నేటి ప్రభుత్వ పాలనలో పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా మారి పట్టణంలోని కొన్ని ప్రాంతాలు కళావిహీనంగా తయారైనాయి. అభివృద్ధి సంగతి దేవుడెరుగు, జీవుడా అంటూ వందల సంఖ్యలోని నివాసస్థులు బతుకు జీవనాన్ని సాగిస్తున్నారు. అసలు అలాంటి సంఘటన ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఆ పట్టణం పై ఓ లుక్ వేయాల్సిందే.

తిరుపతి జిల్లా శ్రీహరికోట సమీపంలోని సూళ్లూరుపేట పురపాలక సంఘానికి శాటిలైట్ టౌన్ గా పేరుంది. అంతరిక్ష ప్రయోగ కేంద్రాన్ని చేరుకోవాలంటూ సూళ్లూరుపేట మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. మరోవైపు స్పెషల్ ఎకనామిక్ జోన్ (సెజ్) లు శ్రీసిటి, మాంబట్టు లోని పరిశ్రమల్లో పనిచేసే ఉద్యోగులకు సూళ్లురుపేట కేంద్ర బిందువు. ఈ రెండింటి కలయుకతో పాటు 5వ నెంబరు జాతీయ రహదారికి ఆనుకొని సూళ్లూరుపేట ఉండడంతో అక్కడి భూముల ధరలు రెక్కలు వచ్చాయి. ఇటు రియల్ వ్యాపారం, అటు ప్రభుత్వ పన్నుల రాబడికి పేట ఓ వరంగా మారింది. ఏటా మునిసిపాలిటీకి వివిధ పన్నుల రూపంలో దాదాపుగా రూ. 4కోట్ల వరకు ప్రజలు చెల్లిస్తుంటారు. కోట్లల్లో పన్నులు వసూలు అయిన్నప్పటికి పురపాలక సంఘం సేవలు మాత్రం అంతంత మాత్రమేగానే ఉన్నాయి. పట్టణంలోని పలు రోడ్లు చిధ్రంగా మారాయి. చినుకు పడితే చాలు చిత్తడి నేలలను తలపిస్తున్నాయి. గుంతలు పడిన రోడ్లు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి.

ఈ క్రమంలోనే జాతీయ రహదారికి, శ్రీహరికోట ప్రధాన రహదారికి సమీపంలోని సాయినగర్ నివాస్ధుల బాధలు వర్ణణాతీతం. కురిసిన వర్షాలకు ప్రధాన రోడ్డు మార్గం బురదమయంగా మారింది. అడుగు తీసి అడుగు వేయాలంటే మరొకరి సాయంతో గాని ముందుకు వెళ్లలేని పరిస్ధితి. రోడ్డు పై పారాడుతున్న బురదతో ద్విచక్ర వాహనదారులు జారి పడి పోతున్నారు. డ్యూటీకి వెళ్లే సమయంలో దుస్తులపై బురద మీద పడకుండా ఉండేందుకు నానా అగచాట్లు పడుతున్నారు. ఇంత దుస్థితికి ప్రధాన కారణం ఇటీవల నీటి పైపు లైను వేసేందుకు రోడ్డును ఇష్టానుసారంగా తవ్వేశారు. అనంతరం వాటిని చదును చేయకపోవడంతో రోడ్డు పై బురద దొర్లాడుతూ నివాసస్థులకు ఇబ్బందికరంగా మారింది. దీంతో ఆ రోడ్డు పై సంచరించేందుకు 700కు పైగా కుటుంబాలకు పైగా నానా కష్టాలు పడుతున్నారు.
నోరు తెరిచి అడిగితే కస్సుమంటున్న ప్రజా ప్రతినిధులు, సమాధానం చెప్పని పురపాలక సంఘ అధికారుల తీరుతో ప్రజలు మౌనంగానే బురద రోడ్డులో పయనిస్తూ బిక్కు బిక్కు మంటూ జీవనం సాగిస్తున్నారు. ఇకనైనా పాలకులు, అధికారులు పట్టణంలో ప్రజల కష్టాలను గుర్తించి చక్కదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఇవి కూడా చదవండి: