KTR File Quash Petition: హైకోర్టుకు కేటీఆర్.. క్వాష్ పిటిషన్‌పై కాసేపట్లో విచారణకు ఛాన్స్!

KTR File Quash Petition In High Court: హైకోర్టులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిటిషన్ వేశారు. ఏసీబీ కేసుపై కేటీఆర్ క్వాష్ పిటిషన్ వేశారు. ఫార్ములీ ఈ-రేసుపై ఏసీబీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. సింగిల్ బెంబ్ జస్టిస్ శ్రవణ్ బెంచ్ ముందు కేటీఆర్ న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు.

అయితే ఈ బెంచ్‌లో క్వాష్ పిటిషన్ విచారణకు అనుమతి లేదని ఏసీబీ కౌన్సిల్ వెల్లడించింది. దీంతో చీఫ్ కోర్టులో న్యాయవాది లంచ్ మోషన్ మెన్షన్ చేశారు. ఈ మేరకు లంచ్ మోషన్‌పై నిర్ణయం తీసుకోవాలని రిజిస్ట్రీకి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు మధ్యాహ్నం 2.15 నిమిషాలకు హైకోర్టులో విచారణకు అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇదిలా ఉండగా, సీఎం రేవంత్‌కు సమాచారం లోపం ఉందని కేటీఆర్ విమర్శలు చేశారు. సీఎంను ఎవరో తప్పుదోవ పట్టిస్తున్నారని పేర్కొన్నారు. నాపై వేసిన ఫార్ములీ ఈ కారు రేసు కేసు నిలవదని ధీమా వ్యక్తం చేశారు. ఈ విషయంలో మేం లీగల్‌గా ముందుకు వెళ్తామన్నారు. ఇప్పటికే లంచ్ మోషన్ పిటిషన్ వేశామని వెల్లడించారు. పొన్నం అవినీతి జరగలేదని అంటున్నారని, మరి ఇంకా ఏసీబీ కేసు ఎందుకు అని ప్రశ్నించారు.

కాగా, ఫార్ములీ ఈ కారు రేసు కేసులో ఏ1గా కేటీఆర్, ఏ2గాగా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, ఏ3గా హెచ్ఎండీఏ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డిలను ఏసీబీ ఎఫ్ఐఆర్‌లో చేర్చింది. అయితే మొత్తం నాలుగు కేసులలో నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేయగా.. కేబినెట్ అనుమతి లేకపోవడంతో పాటు ఫైనాన్స్ క్లియరెన్స్ లేకుండానే విదేశీ కంపెనీకి దాదాపు రూ.55 కోట్లు నిధులు చెల్లించినట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ హైకోర్టు ఆశ్రయించినట్లు తెలుస్తోంది. తన కేసును కొట్టివేయాలని కోరుతూ క్వాష్ పిటిషన్ వేసినట్లు తెలిసింది.