Site icon Prime9

Bigg Boss Show: బిగ్‌బాస్‌కు గౌరవం దక్కడం లేదు – హోస్టింగ్‌కి గుడ్‌బై చెప్పిన స్టార్‌ హీరో

దేశవ్యాప్తంగా బిగ్‌బాస్‌ షో మంచి ఆదరణ పొందింది. అన్ని భాషల్లోనూ ఈ షో సూపర్‌ హిట్‌ అయ్యింది. నిన్నే తెలుగు బిగ్‌బాస్‌ 8వ సీజన్‌ పూర్తయ్యింది. ఇక హిందీలో దాదాపు 18 సీజన్లు పూర్తి చేసుకుంది. అయితే ఏ భాషల్లో అయిన ఈ షోకు ఆయా స్టార్‌ హీరోలు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల బిగ్‌బాస్‌ షో హోస్టింగ్‌కి ఓ స్టార్‌ హీరో గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. ప్రస్తుత సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఆయన అక్టోబర్‌లో సడెన్‌గా ఓ ట్వీట్‌ వదిలారు. ఇక బిగ్‌బాస్‌కి హోస్ట్‌ చేయనని, తాను ఈ షోని వదిలేసే టైం వచ్చిందంటూ షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు.

ఇది చూసి అంతా షాక్‌ అయ్యారు. ఆయనేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారా? అంతా డైలామాలో ఉన్నారు. ఈ క్రమంలో తన నిర్ణయానికి కారణంపై క్లారిటీ ఇచ్చాడు ఆ హీరో. ఇంతకి ఆయన ఎవరూ? ఏ బిగ్‌బాస్‌ అని ఆలోచిస్తున్నారు. ఆయనే కన్నడ స్టార్‌ హీరో కిచ్చా సుదీప్‌. ప్రస్తుతం ఆయన బిగ్‌బాస్‌ కన్నడ 11వ సీజన్‌కి వ్యాఖ్యాతగా వ్యహరిస్తున్నారు. గత పది సీజన్లకు కూడా ఆయన హోస్ట్. మొదటి ఈ షోని సక్సెస్‌ఫుల్‌గా రన్‌ చేస్తున్న ఆయన గత అక్టోబర్‌ ట్వీట్‌ చేశారు. బిగ్‌బాస్‌ 11వ సీజన్‌కి మీ నుంచి వస్తున్న గొప్ప స్పందనకు ధన్యవాదాలు.

మీరు నాపై, ఈ షోపై చూపిస్తున్న ఆదరణకు టీవీఆర్‌ రేటింగ్స్‌ ప్రత్యేక్ష ఉదాహరణ. గత 10+1 సంవత్సరాలుగా బిగ్‌బాస్‌ ద్వారా కలిసి ప్రయాణించడం బాగుంది. కానీ ఇప్పుడు దాని నుంచి . అయితే ఇప్పుడు నేను చేయాల్సి పనికోసం దీని నుంచి తప్పుకోవాల్సిన సమయం వచ్చింది. బిగ్‌బాస్‌ కన్నడ షోకి హోస్ట్‌గా ఇదే నా చివరి సీజన్‌. నా నిర్ణయాన్ని కలర్స్‌ (టీవీ చానల్‌)తో పాటు ఇంతకాలం బిగ్‌బాస్‌ని ఫాలో అవుతున్న ప్రతి ప్రేక్షకుడు ఒక్కరు గౌరవిస్తారని నమ్ముతున్నాను. ఈ సీజన్‌ని అత్త్యుత్తమంగా ముందుకు తీసుకువెళదాం. అలాగే నేను కూడా మీ అందరిని బాగా ఎంటర్‌చేస్తాను” అంటూ తన పోస్ట్‌లో రాసుకొచ్చాడు.

అందుకే ఈ నిర్ణయం

తాజాగా ఇంటర్య్వూలో సుదీప్‌ తన నిర్ణయంపై స్పందించాడు. “ఆ ట్వీట్‌ చేసిన రోజు నేను చాలా అలసిపోయి ఉన్నాను. అప్పుడు నాకు అనిపించింది చేశాను. అప్పుడు నా అంతర్గత లోటుపాట్లు నేను ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం. అప్పుడే నేను ఆ పోస్ట్‌ షేర్‌ చేయకపోయింటే మళ్లీ నా ఆలోచనలు, నిర్ణయాలు మారేవేమో. కొన్నిసార్లు మన చూట్టూ ఉన్న ప్రతిఒక్కరు కోసం కష్టపడాల్సిన పనిలేదనిపించింది. అక్కడ ఎంత కష్టపడ్డా ఫలితం ఉండటం లేదు. మిగతా భాషల్లో బిగ్‌బాస్‌కు వచ్చిన గుర్తింపు కన్నడలో రావడం లేదు.

ఇక్కడ ఈ షోకి పెద్దగా ఆదరణ పొందడం లేదు. మిగతా షోలతో నా షోను పోల్చి చూస్తే దీనికి మరింత గౌరవం దక్కాలనేది నా ఉద్దేశం. అలా లేనప్పుడు దానినుంచి తప్పుకోవడమే కరెక్ట్‌. ఎంత శ్రమించిన అక్కడ ఫలితం కనబడనప్పుడు ఆ శ్రమను నా సినిమాలకు పెట్టుంటే బాగుండేదనిపించింది. అందుకే ఆ నిర్ణయం తీసుకున్నా” అని వెల్లడించాడు. ప్రస్తుతం సుధీప్‌ కామెంట్స్‌ నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. కాగా ‘ఈగ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఆయన ఎప్పటికప్పుడు ఏదోక సినిమాలో అతిథి పాత్రలతో అలరిస్తున్నాడు.

Exit mobile version