K.Vijayanand is new Chief Secretary of AP: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ ప్రభుత్వ కొత్త ప్రధాన కార్యదర్శిగా విజయానంద్ నియామకమయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం సీఎస్‌గా ఉన్న నీరభ్ కుమార్ ప్రసాద్ పదవీకాలం డిసెంబర్ 31న ముగియనుంది. ఈ నేపథ్యంలోనే నూతన సీఎస్‌గా విజయానంద్‌ను నియమించారు.
వచ్చే ఏడాది జనవరి 1వ తేదీన విజయానంద్ సీఎస్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయన 1992 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి కాగా, ప్రస్తుతం ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. సీఎస్‌గా నియామకమైన తర్వాత 2026 నవంబర్ చివరి వరకు బాధ్యతలు నిర్వహిస్తారు. అనంతరం పదవీ విరమణ ఉండనుంది. అంతకుముందు, 2022లో ఏపీ జెన్ కో ఛైర్మన్‌గా పనిచేశారు. ఆ తర్వాత 2023లో ఏపీ ట్రాన్స్‌పర్ సీఎండీగా బాధ్యతలు నిర్వహించారు.
విజయానంద్.. వైఎస్సార్ జిల్లా రాజుపాలెం మండలంలోని అయ్యవారిపల్లె గ్రామంలో జన్మించారు. తొలిసారి ఆయన ఆదిలాబాద్ జిల్లాలో అసిస్టెంట్ కలెక్టర్‌గా పోస్టింగ్ చేయగా.. రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్‌గా శ్రీకాకుళం, నల్గొండ జిల్లాల కలెక్టర్‌గా పనిచేశారు.