Last Updated:

CM KCR: ప్రముఖ పాత్రికేయులు వరదాచారి మృతి.. సీఎం కేసిఆర్ సంతాపం

నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్రముఖ పాత్రికేయులు గోవర్ధన సుందర వరదాచారి (92) కిమ్స్ వైద్యశాలలో చికిత్స పొందుతూ నేటి మధ్యాహ్నం కన్నుమూశారు

CM KCR: ప్రముఖ పాత్రికేయులు వరదాచారి మృతి.. సీఎం కేసిఆర్ సంతాపం

Hyderabad: నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్రముఖ పాత్రికేయులు గోవర్ధన సుందర వరదాచారి (92) కిమ్స్ వైద్యశాలలో చికిత్స పొందుతూ నేటి మధ్యాహ్నం కన్నుమూశారు. వరదాచారికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. నాలుగు దశాబ్ధాల పాటు జర్నలిజం రంగం వృద్ధికి కృషి చేశారు. 1956లో ఓ తెలుగు దినపత్రికలో సబ్ ఎడిటర్ గాన తన పాత్రికేయ వృత్తిని ఆయన ప్రారంభించారు. అనంతరం ఆంద్రభూమిలో న్యూస్ ఎడిటర్ గా 22 ఏళ్ల పాటు తన సేవలు అందించారు. 1983లో ఈనాడు దినపత్రికలో అసిస్టెంట్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రముఖ దిన పత్రికల జర్నలిజం కళాశాలలు, తెలుగు విశ్వవిద్యాలయంలో ఆయన బోధించారు.

పాత్రికేయులు వరదాచారి మరణం పట్ల తెలంగాణ సీఎం కేసిఆర్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నట్లు సీఎం పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Minister KTR: పాన్ ఇండియా సినిమాను చూపిస్తా.. ఎమ్మెల్యేల ప్రలోభాల డీల్ కేసులో మంత్రి కేటిఆర్

ఇవి కూడా చదవండి: