Last Updated:

Job-for-sex racket: అండమాన్ మరియు నికోబార్ దీవుల్లో జాబ్-ఫర్-సెక్స్ రాకెట్

అండమాన్ మరియు నికోబార్ దీవుల్లో జాబ్-ఫర్-సెక్స్' రాకెట్ సంచలనం సృష్టించింది. మాజీ చీఫ్ సెక్రటరీ జితేంద్ర నరైన్ తన ఏడాది పదవీ కాలంలో 20 మందికి పైగా మహిళలను పోర్ట్ బ్లెయిర్ నివాసానికి తీసుకెళ్లారని, లైంగిక వేధింపులకు గురిచేసారని దీనికి బదులుగా కొందరికి ఉద్యోగాలు ఇచ్చారని విచారణలో వెల్లడయింది.

Job-for-sex racket: అండమాన్ మరియు నికోబార్ దీవుల్లో జాబ్-ఫర్-సెక్స్ రాకెట్

Andaman and Nicobar: అండమాన్ మరియు నికోబార్ దీవుల్లో జాబ్-ఫర్-సెక్స్’ రాకెట్ సంచలనం సృష్టించింది. మాజీ చీఫ్ సెక్రటరీ జితేంద్ర నరైన్ తన ఏడాది పదవీ కాలంలో 20 మందికి పైగా మహిళలను పోర్ట్ బ్లెయిర్ నివాసానికి తీసుకెళ్లారని, లైంగిక వేధింపులకు గురిచేసారని దీనికి బదులుగా కొందరికి ఉద్యోగాలు ఇచ్చారని విచారణలో వెల్లడయింది.

21 ఏళ్ల మహిళ నరైన్ మరియు లేబర్ కమిషనర్ ఆర్‌ఎల్ రిషిపై సామూహిక అత్యాచారం మరియు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు చేయడంతో ఈ విషయం బయటకు వచ్చింది. తాను ఉద్యోగం కోసం వెతుకుతున్నప్పుడు హోటల్ యజమాని ద్వారా రిషి పరిచయమయ్యాడని మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది. కమీషనర్ తనను చీఫ్ సెక్రటరీ నివాసానికి తీసుకెళ్లారని, అక్కడ తనకు మద్యం ఇచ్చారని, అయితే తాను నిరాకరించానని ఆపై ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారని ఆమె ఆరోపించింది. తరువాత ఇద్దరు వ్యక్తులు తనను క్రూరంగా మరియు లైంగికంగా వేధించారని ఆమె ఆరోపించింది.

రెండు వారాల తర్వాత అదే రిపీట్ అయిందని ఉద్యోగానికి బదులుగా లైంగిక దాడిని ఎవరికీ చెప్పవద్దని బెదిరించారని మహిళ పేర్కొంది. ఈ ఇద్దరు బ్యూరోక్రాట్‌ల మొబైల్ ఫోన్‌ల కాల్ డేటా రికార్డ్స్, మరియు సెల్ ఫోన్ టవర్ లొకేషన్‌లు, బాధితమహిళ ఆరోపణల పై సిట్ విచారణ జరిపింది.చీఫ్ సెక్రటరీ ఇంట్లో ఉన్న సీసీటీవీ కెమెరా యొక్క డిజిటల్ వీడియో రికార్డర్ యొక్క హార్డ్ డిస్క్ మొదట చెరిపివేయబడిందని మరియు తరువాత, జూలైలో పోర్ట్ బ్లెయిర్ నుండి ఢిల్లీకి బదిలీ చేయబడిన సమయంలో అది తీసివేయబడిందని తేలింది. అయితే నరైన్ హోం మంత్రిత్వ శాఖకు రాసిన లేఖలో ఈ ఆరోపణలను ఖండించారు. ఇది తన పై “కుట్ర” అని పేర్కొన్నాడు. అతను ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న రెండు తేదీలలో ఒకదానిలో పోర్ట్ బ్లెయిర్‌లో ఉండడాన్ని సవాలు చేశాడు మరియు న్యూఢిల్లీలో తన ఉనికిని చూపించడానికి విమాన టిక్కెట్లు మరియు అపాయింట్‌మెంట్ షెడ్యూల్‌లను పేర్కొన్నాడు.

అక్టోబర్ 17న హోం మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు నరైన్ ను సస్పెండ్ చేసారు. లేబర్ కమిషనర్ రిషిని కూడా సస్పెండ్ చేసి నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసారు. పోర్ట్ బ్లెయిర్‌లో అతని బెయిల్ పిటిషన్ తిరస్కరించబడింది. ప్రధాన కార్యదర్శి సిబ్బంది సహా కీలక సాక్షుల వాంగ్మూలం ప్రకారం మహిళలను ఆయన ఇంటికి రప్పించారని తేలింది. “మహిళలను పికప్” చేయమని, తరచుగా స్థానిక రెస్టారెంట్ నుండి ఆహారాన్ని తీసుకురండి, చీఫ్ సెక్రటరీ ఇంట్లో వారికి వడ్డించమని, ఆ తర్వాత మహిళలను డ్రాప్ చేయమని ఆదేశిస్తారని వారు సిట్‌కి చెప్పినట్లు సమాచారం. మరోవైపు, కలకత్తా హైకోర్టు మాజీ చీఫ్ సెక్రటరీకి మంజూరు చేసిన మధ్యంతర బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించాలని యోచిస్తున్నట్లు మహిళ కుటుంబం తెలిపింది.

ఇవి కూడా చదవండి: