Last Updated:

Pawan Kalyan: జనసేనాని నోట జగన్ మాట

గన్ మాట పవన్ నోట, అవును మీరు వింటున్నది నిజమే. విజయనగరం నుంచి కొత్త నినాదం అందుకున్నారు జన సేనాని పవన్‌ కల్యాణ్‌. ఏంటా కొత్త నినాదం. అది పవన్‌కు వర్కవుట్‌ అవుతుందా? జగనన్న ఇళ్ల భూసేకరణలో చోటు చేసుకున్న అవినీతి.

Pawan Kalyan: జనసేనాని నోట జగన్ మాట

Andhra Pradesh: జగన్ మాట పవన్ నోట, అవును మీరు వింటున్నది నిజమే. విజయనగరం నుంచి కొత్త నినాదం అందుకున్నారు జన సేనాని పవన్‌ కల్యాణ్‌. ఏంటా కొత్త నినాదం. అది పవన్‌కు వర్కవుట్‌ అవుతుందా? జగనన్న ఇళ్ల భూసేకరణలో చోటు చేసుకున్న అవినీతి. అక్రమాలను బయటపెట్టటంతో పాటు ఈ పథకం కింద ఎలాంటి మోసపూరిత ప్రకటనలు చేస్తున్నారన్న విషయాన్ని బట్టబయలు చేసేందుకు జనసేనాని పవన్‌ కల్యాణ్‌ స్వయంగా రంగంలోకి దిగారు. విజయనగరం జిల్లాలోని గుంకలాం వద్ద ఇళ్ల స్థలాల లేఔట్‌ను పరిశీలించారు. ఇక్కడ పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణం జరిగినట్లుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెబుతుంటే, వాస్తవానికి అందుకు భిన్నమైన పరిస్థితులు ఉన్న విషయాన్ని పవన్‌ బట్టబయలు చేశారు.

జగన్ సర్కారు డొల్లతనాన్ని తెర మీదకు తీసుకురావటమే లక్ష్యంగా పవన్ కల్యాణ్ ‘జగనన్న ఇళ్లు, పేదలకు కన్నీళ్లు’ కార్యక్రమాన్ని చేపట్టారు. దీన్ని ఎంపిక చేసుకోవటానికి కారణం ఏపీ వ్యాప్తంగా జగన్ సర్కారు అమలు చేస్తున్న ఇళ్ల ప్రోగ్రాంలో ఇదే అతి పెద్దది. ఇక్కడ మొత్తం 397 ఎకరాల్లో 12301 ప్లాట్లు వేసి, 10800 మందికి ఇళ్లను మంజూరు చేశారు. ఈ భూసేకరణలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందన్నఆరోపణలు ఉన్నాయి. ఇదిలా ఉంటే, ఈ లేఔట్ లో మొత్తం 42 ఇళ్లు పూర్తి అయినట్లుగా రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ చెబుతోంది. అయితే, పవన్ కల్యాణ్ పర్యటనలో తేలిందేమిటంటే ప్రభుత్వం చెబుతున్న దానికి భిన్నంగా ఒక్కటంటే ఒక్క నిర్మాణం కూడా పూర్తి కాలేదని తేలింది. ఇక, జనసేనాని పవన్ కళ్యాణ్ తన రాజకీయ భవిష్యత్తు మీద స్పష్టంగా ఉన్నారా? ఆయన ఒక కచ్చితమైన ఆలోచనతో ముందుకు సాగుతున్నారా అన్న చర్చ అయితే సాగుతోంది. ఇప్పటిదాకా పొత్తుల గురించి అటూ ఇటూ పార్టీలకు చెందిన పెద్దలతో కరచాలనం చేస్తూ వచ్చిన పవన్ లేటెస్ట్ గా చేసిన కొన్ని కామెంట్స్ మాత్రం సంచలనంగానే ఉన్నాయి.
గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఏపీలో అత్యంత పాపులర్ అయిన నినాదం “ఒక్క చాన్స్”. వైసిపీ ప్లీనరీ నుంచి ప్రశాంత్ కిషోర్ సాక్షిగా జగన్ మోహన్ రెడ్డి అందుకున్న ఈ నినాదం ఏపీలోని మూల మూలకూ చొచ్చుకు పోయింది. 2014 ఎన్నికల్లో ఓటమి పాలైన జగన్ పై సానుభూతిని పెంచడంలో ఈ “ఒక్క చాన్స్” పాత్ర పెద్దదే.

ఒక్క చాన్స్ ఇవ్వండి, ఒకే ఒక్క చాన్స్ ఇవ్వండి. “ఇదేదో 2019 ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన నినాదం కాదు. లేటెస్ట్‌గా జనసేనాని పవన్ కల్యాణ్ నోట నుంచి వచ్చిన సరకొత్త పొలిటికల్ నినాదం. తనకు ఒక్క చాన్స్ ఇవ్వాలని, ప్రజాస్వామ్యం అంటే ఏమిటో చూపిస్తాను అని పవన్ విజ్ఞప్తి చేయడం చర్చనీయాంశం అయింది. రాజకీయాల్లో అవినీతిని పారదోలి యువతకు అవకాశం ఇస్తామని, అలాగే మార్పునకు తమ పార్టీ కృషి చెస్తుందని ఆయన చెప్పుకున్నారు. మరి పవన్ ఈ విధంగా చెబుతున్నారు అంటే ఆయన ఒంటరిగా పోటీకి సిద్ధపడుతున్నారా అన్నది కూడా చర్చకు వస్తోంది. మూడు రోజుల క్రితం పవన్ కళ్యాణ్ విశాఖలో ప్రధాని మోదీని కలసి వచ్చారు. దాంతో బీజేపీతో కలసి జనసేన వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తుందని అంతా అనుకున్నారు. అది జరిగిన తరువాత మీడియా ముందు పెద్దగా ఏమీ మాట్లాడని పవన్, ఇపుడు విజయనగరం జిల్లా టూర్ లో తనను నమ్మాలని జనసేనకు అధికారం ఇవ్వాలని కోరడం ద్వారా బీజేపీని పక్కన పెట్టేశారా అన్న చర్చ మళ్లీ వస్తోంది, అయితే, జనసేన బీజేపీ కలసి పోటీ చేస్తాయని ఎన్నికల్లో ఈ రెండు పార్టీల మధ్యనే పొత్తు ఉంటుందని కమలనాథులు ఈ రోజుకూ ప్రకటించుకుంటున్న పరిస్థితి ఉంది. కానీ జనసేన నేతలు మాత్రం ఇప్పటికి కూడా ఆ విషయం మీద మాట్లాడడం లేదు. బీజేపీ అన్న మాట అయితే జనసేన నాయకుల నోటి నుంచి అసలు రావడం లేదు. ఇపుడు చూస్తే పవన్ కళ్యాణ్ జనసేనకే పట్టం కట్టమని చెబుతున్నారు అంటే ఆలోచించాల్సిందే అంటున్నారు రాజకీయ పరిశీలకులు.

ఈ పరిస్థితుల్లో 2019 ఎన్నికల్లో పాపులర్ అయిన నినాదం, మరోసారి తెర పైకి వచ్చింది. అయితే, జగన్ అంటేనే రాజకీయంగా మండిపడే పవన్ కల్యాణ్ ఇప్పుడు ఆయన వాడిన నినాదాన్ని అందుకోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది అంటున్నారు ఎనలిస్టులు. మరి 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి వర్క్ ఔట్ అయిన “ఒక్క చాన్స్ ” స్లోగన్ 2024లో పవన్ కు కూడా లక్కును తెచ్చి పెడుతుందా, చూడాలి.

ఇవి కూడా చదవండి: