Last Updated:

Pawan kalyan: తెలంగాణ విముక్తి కోసం అసువులు ధారబోసిన వీరులకు ప్రణామాలు.. పవన్ కళ్యాణ్

తెలంగాణ ప్రజలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 75వ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. నిత్య చైతన్య దీప్తి తెలంగాణ చైతన్యానికి నెలవు, విప్లవాలకు కొలువు తెలంగాణ. ప్రపంచంలోనే పేరుగాంచిన సాయుధ పోరాటానికి జన్మనిచ్చిన పురిటి గడ్డ తెలంగాణ.

Pawan kalyan: తెలంగాణ విముక్తి కోసం అసువులు ధారబోసిన వీరులకు ప్రణామాలు.. పవన్ కళ్యాణ్

Amaravati: తెలంగాణ ప్రజలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 75వ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. నిత్య చైతన్య దీప్తి తెలంగాణ చైతన్యానికి నెలవు, విప్లవాలకు కొలువు తెలంగాణ. ప్రపంచంలోనే పేరుగాంచిన సాయుధ పోరాటానికి జన్మనిచ్చిన పురిటి గడ్డ తెలంగాణ. అటువంటి ఈ పుణ్యభూమికి సంపూర్ణ స్వేచ్ఛ లభించిన రోజు సెప్టెంబర్ 17. దీనిని విమోచన అనండి లేదా విలీనం అనండి. ఏ పేరుతో పిలిచినా సరే, ఈ రోజు మాత్రం చారిత్రాత్మక శుభ దినం.

ప్రజలకు బానిస సంకెళ్లు తొలగిన మరపురాని దినం. తెలంగాణ వాసులందరికీ పండుగ దినం. 75వ విమోచన దినోత్సవం జరుపుకొంటున్న శుభ తరుణాన, తెలంగాణ బిడ్డలందరికీ నా పక్షాన, జనసేన పార్టీ పక్షాన శుభాకాంక్షలు తెలుపుతున్నాను. నిరంకుశ పాలకుల కబంధ హస్తాల నుంచి తెలంగాణ తల్లి విముక్తి కోసం అసువులు ధారబోసిన వీరులకు ప్రణామాలు అర్పిస్తున్నాను.

ఈ గడ్డలోని అనువణువునా నిక్షిప్తమైన పోరాటతత్త్వం, అన్యాయాలపై గళమెత్తే గుండె ధైర్యమే ఈ నేలకు సర్వదా రక్ష. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెంది కళకళలాడాలని, ప్రజలు సుఖశాంతులు, సంపదలతో విరజిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానుఅంటూ పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి: