Last Updated:

Imran Khan: మోదీ పై పాకిస్తాన్ మాజీ ప్రధాని ప్రశంసల జల్లు

పాకిస్ధాన్ ముస్లిం లీగ్ అధినేత నవాజ్ షరీష్ ను విభేధిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ పై పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రశంసల జల్లు కురిపించారు. పాకిస్థానలో ఓ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ మోదీని ఉదహరిస్తూ నవాజ్ ను ఏకిపారేసారు.

Imran Khan: మోదీ పై పాకిస్తాన్ మాజీ ప్రధాని ప్రశంసల జల్లు

Pakistan: పాకిస్ధాన్ ముస్లిం లీగ్ అధినేత నవాజ్ షరీష్ ను విభేధిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ పై పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రశంసల జల్లు కురిపించారు. పాకిస్థానలో ఓ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ మోదీని ఉదహరిస్తూ నవాజ్ ను ఏకిపారేసారు.

ప్రపంచంలోని ఏ ఇతర రాజకీయ నాయకులకు విదేశాల్లో బిలియన్ల ఆస్తులను కూడబెట్టలేదని నవాజ్ నుద్ధేశించి ప్రసంగించారు. చట్టబద్దమైన పాలన లేకపోతే పెట్టుబడులు రావన్నారు. అలాంటి పాలన లేకపోతే అవినీతి రాజ్యమేలుతుందని, మన పొరుగు దేశమైన భారతదేశ ప్రధాని మోదీకి విదేశాల్లో అసలు ఆస్తులు ఉన్నాయా, గమనించండి అంటూ ఉదహరించారు.

దీంతో పొరుగు దేశాల్లో సైతం మోదీకి ప్రత్యేక స్ధానం ఉందని పాకిస్థాన్ మాజీ ప్రధాని రుజువుచేశారు. గతంలో కూడా ఇమ్రాన్ మోదీని ప్రశంసించి వున్నారు. అమెరికా, రష్యా మద్య ఏర్పడిన యుద్ధ వాతావరణంలో తలెత్తిన వత్తిడి సమయంలోనూ రష్యా నుండి రాయితీ చమురును కొనుగోలు చేసిన సమయంలో ఆయన మోదీ పై అభినందన జల్లు కురిపించారు. స్వతంత్ర విదేశాంగ విధానానికి ఆనాటి ఘటన ఓ మచ్చుతునకగా ఇమ్రాన్ అప్పట్లో తెలిపివున్నారు.

ఇవి కూడా చదవండి: