Last Updated:

Hiranandani Group: యూపిలో 39వేల కోట్ల పెట్టుబడి పెట్టనున్న హిరానందానీ గ్రూపు

డేటా సెంటర్ వ్యాపారంలో భాగంగా యోట్టా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉత్తరప్రదేశ్‌లో రూ.39వేల కోట్లు పెట్టుబడి పెట్టనుందని కంపెనీ కో ఫౌండర్, హిరానందానీ గ్రూపు చైర్మన్ దర్శన్ హిరానందాని పేర్కొన్నారు.

Hiranandani Group: యూపిలో 39వేల కోట్ల పెట్టుబడి పెట్టనున్న హిరానందానీ గ్రూపు

Noida: డేటా సెంటర్ వ్యాపారంలో భాగంగా యోట్టా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉత్తరప్రదేశ్‌లో రూ.39వేల కోట్లు పెట్టుబడి పెట్టనుందని కంపెనీ కో ఫౌండర్, హిరానందానీ గ్రూపు చైర్మన్ దర్శన్ హిరానందాని పేర్కొన్నారు. యూపీ ప్రభుత్వంతో కుదుర్చుకొన్న ఒప్పందం మేర ఈ పెట్టుబడులు దశల వారీగా రాష్ట్రానికి రానున్నట్లు ఆయన తెలిపారు. యోట్టా డి1 డేటా సెంటర్ ప్రారంభ కార్యక్రమంలో విలేకరులతో చైర్మన్ మాట్లాడారు.

డేటా సెంటర్లను ఆరింటిని ఏర్పాటు చేసే క్రమంలో మొదటిది పూర్తి అయిందన్నారు. మరో ఏడాదిన్నరలో రెండు భవనాలు అందుబాటులోకి వస్తాయన్నారు. ప్రతి 18 నెలలకు ఓ భవానాన్ని నిర్మిస్తూ వ్యాపారాన్ని పెంచుతున్నామన్నారు. ఒక్కొక్క డేటా సెంటర్ కు రూ. 6500కోట్లు ఖర్చు అవుతందన్నారు. గ్రేటర్ నోయిడా డేటా సెంటర్ పార్క్‌లో దాదాపు రూ. 1,500 కోట్ల పెట్టుబడితో హైపర్‌స్కేల్ డేటా సెంటర్, యోట్టా డి1లో ఏర్పాటు చేశామన్నారు. ఏడు సర్వర్లు కల్గిన అంతస్తులలో 5,000 ర్యాక్‌లను ఉంచగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని, పూర్తి లోడ్‌పై ఫెయిల్-సేఫ్, 48-గంటల పవర్ బ్యాకప్‌ను అందిస్తుందన్నారు. గ్రేటర్ నోయిడా డేటా సెంటర్ పార్క్ లో 20 ఎకరాల్లో విస్తరించి ఉన్న యోట్టా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లో మొత్తం 30,000 రాక్‌లు, 4 డెడికేటెడ్ ఫైబర్ పాత్‌లు మరియు 160 మెగావాట్ల ఐటీ పవర్ సామర్థ్యాన్ని అందించేలా నిర్మాణం సాగుతుందన్నారు.

యోట్టా ఆసియాలో అప్‌టైమ్ ఇన్‌స్టిట్యూట్ ద్వారా ధృవీకరించబడిన అతిపెద్ద టైర్ IV డేటా సెంటర్. కాగ ప్రపంచంలో రెండవ అతిపెద్ద డాటా సెంటర్. ఎం1 భవనాన్ని 2020లో నాటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ధాకరే సమక్షంలో వర్చువల్ విధానంలో నొయిడాలో నిర్మాణాన్ని ప్రారంభించారు.

ఇది కూడా చదవండి: Realme c33: ఔరా.. రూ. 549 స్మార్ట్ ఫోన్ కొనవచ్చు..!

ఇవి కూడా చదవండి: