Last Updated:

Sonali Phogat death: సోనాలి ఫోగట్ హత్య కేసుపై సీబీఐ దర్యాప్తు చేయాలన్న గోవా సర్కార్

సోనాలి ఫోగట్ హత్య కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) విచారణకు గోవా ప్రభుత్వం సోమవారం సిఫారసు చేసింది. ఆదివారం, సోనాలి ఫోగట్ కుటుంబ సభ్యులు హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌ను కూడా కలిసారు.

Sonali Phogat death: సోనాలి ఫోగట్ హత్య కేసుపై సీబీఐ దర్యాప్తు చేయాలన్న గోవా సర్కార్

Goa: సోనాలి ఫోగట్ హత్య కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) విచారణకు గోవా ప్రభుత్వం సోమవారం సిఫారసు చేసింది. ఆదివారం, సోనాలి ఫోగట్ కుటుంబ సభ్యులు హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌ను కూడా కలిసారు. గోవా పోలీసుల దర్యాప్తు పై వారు అసంతృప్తిగా ఉన్నందు సీబీఐ ద్వారా దర్యాప్తు చేయించాలని కోరిారు.

“మేము గోవా పోలీసులను పూర్తిగా విశ్వసిస్తాము, కానీ సోనాలి ఫోగట్ కుమార్తె డిమాండ్ కారణంగా, నేను సిబిఐ విచారణకు సిఫార్సు చేసాను” అని గోవా సిఎం ప్రమోద్ సావంత్ అన్నారు. ఈ కేసులో గోవా పోలీసులకు చాలా మంచి ఆధారాలు లభించాయి. సోనాలి ఫోగట్ కుమార్తె మరియు కుటుంబం ఈ విషయం పై సీబీఐ విచారణకు డిమాండ్ చేసారు. నాకు చాలా మంది నుండి అభ్యర్థనలు కూడా వచ్చాయి. కేసును కేంద్రానికి అప్పగించాలని నేను హోం మంత్రికి లేఖ రాస్తాను అని సావంత్ తెలిపారు.

ఈ కేసును సీబీఐకు అప్పగించాలని హోం మంత్రికి లేఖ రాస్తున్నాను. మా పోలీసులపై మాకు నమ్మకం ఉంది. వారు మంచి దర్యాప్తు చేస్తున్నారు. కానీ ఇది ప్రజల డిమాండ్ అని సీఎం సావంత్ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి: