Last Updated:

Roger Federer: వెక్కివెక్కి ఏడ్చిన టెన్నిస్ దిగ్గజాలు ఫెదరర్, నాదల్.. ఎందుకో తెలుసా..!

టెన్నిస్‌ దిగ్గజం, స్విస్‌ మాస్టర్‌ రోజ‌ర్ ఫెద‌ర‌ర్ టెన్నిస్ కు  వీడ్కోలు పలికారు. స్పెయిన్‌ బుల్‌ రఫేల్‌ నాదల్‌తో కలిసి లావెర్ క‌ప్‌ 2022లో డ‌బుల్స్ మ్యాచ్‌ ముగిసిన అనంతరం ఫెదరర్ కంటిత‌డి పెట్టారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. లావెర్ క‌ప్‌ 2022తో రోజ‌ర్ ఫెదరర్‌ ప్రొఫెషనల్‌ టెన్నిస్‌ కెరీర్‌ ముగిసింది.

Roger Federer: వెక్కివెక్కి ఏడ్చిన టెన్నిస్ దిగ్గజాలు ఫెదరర్, నాదల్.. ఎందుకో తెలుసా..!

Roger Federer: టెన్నిస్‌ దిగ్గజం, స్విస్‌ మాస్టర్‌ రోజ‌ర్ ఫెద‌ర‌ర్ టెన్నిస్ కు  వీడ్కోలు పలికారు. స్పెయిన్‌ బుల్‌ రఫేల్‌ నాదల్‌తో కలిసి లావెర్ క‌ప్‌ 2022లో డ‌బుల్స్ మ్యాచ్‌ ఆడిన ఫెద‌ర‌ర్ ఓటమిపాలయ్యారు. ఫెద‌ర‌ర్‌, రఫెల్ నాద‌ల్ జోడి 4-6, 7-6 (7/2), 11-9 స్కోర్‌తో ఫ్రాన్సెస్ టియాఫో, జాక్ సాక్ చేతిలో ఓటమిపాలయ్యారు.

ఈ మ్యాచ్ ముగిసిన త‌ర్వాత ఫెదరర్ కంటిత‌డి పెట్టారు. రోజర్ కన్నీళ్లు చూసి నాదల్‌ కూడా భావోద్వేగానికి గురయ్యారు. ఇద్దరూ కన్నీటి పర్యంతం అయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. లావెర్ క‌ప్‌ 2022తో రోజ‌ర్ ఫెదరర్‌ ప్రొఫెషనల్‌ టెన్నిస్‌ కెరీర్‌ ముగిసింది. దీనితో అతడు  తీవ్ర ఉద్వేగానికి లోనయ్యాడు. తన బెస్ట్ ఫ్రెండ్ అయిన నాదల్‌తో పాటు తోటి ఆటగాళ్లను హగ్ చేసుకుంటూ కంటిత‌డి పెట్టారు. ఈ దృశ్యాన్ని చూసిన ప్రేక్షకులు కూడా భావోద్వేగానికి గురయ్యారు. అనంతరం ఈ జ‌ర్నీ అద్భుతంగా సాగింద‌ని, సంతోషంగా ఉన్నాన‌ని తనకెరీర్లో తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు ఫెద‌ర‌ర్.

రోజ‌ర్ ఫెదరర్‌, రఫెల్ నాదల్‌ ఏడుస్తున్న ఫోటోలను ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ నిర్వాహకులు తమ ట్విటర్ ద్వారా షేర్‌ చేశారు. ‘చిరకాల ప్రత్యర్థులు, బెస్ట్ ఫ్రెండ్స్ ఫర్‌ ఎవర్‌. ఈ దృశ్యం చూడడానికే చాలా బాధగా ఉందంటూ వారు తెలిపారు. మరోవైపు ఫెదరర్‌ కన్నీటికి సంబంధించిన వీడియోను లావెర్‌ కప్‌ నిర్వాహకులు ట్వీట్ చేశారు. స్విస్‌ దిగ్గజానికి ఘనంగా వీడ్కోలు పలికారు.

ఇదీ చదవండి: 

ఇవి కూడా చదవండి: