Last Updated:

Bhuma Akhila Priya: ఎమ్మెల్యే శిల్పా రవి పై మాజీ మంత్రి అఖిల ప్రియ మండిపాటు

నంద్యాల వైకాపా శాసనసభ్యులు శిల్పా రవి పై మాజీ మంత్రి అఖిల ప్రియ ఫైర్ అయ్యారు. ఆమె మీడియాతో పలు అంశాల పై మాట్లాడారు. వెన్నపోటు గురించి మాట్లాడడం ఎమ్మెల్యేకు తగదన్నారు. మాజీ సీఎం చంద్రబాబు గురించి మాట్లాడే స్థాయి రవికి లేదన్నారు.

Bhuma Akhila Priya: ఎమ్మెల్యే శిల్పా రవి పై మాజీ మంత్రి అఖిల ప్రియ మండిపాటు

Nandyal: నంద్యాల వైకాపా శాసనసభ్యులు శిల్పా రవి పై మాజీ మంత్రి అఖిల ప్రియ ఫైర్ అయ్యారు. ఆమె మీడియాతో పలు అంశాల పై మాట్లాడారు. వెన్నపోటు గురించి మాట్లాడడం ఎమ్మెల్యేకు తగదన్నారు. మాజీ సీఎం చంద్రబాబు గురించి మాట్లాడే స్థాయి రవికి లేదన్నారు. తెదేపా నేతల గురించి కాని, పార్టీ గురించి గాని మాట్లాడితే సహించేది లేదని శిల్పరవిని హెచ్చరించారు.

జగన్ జైలుకు వెళ్లిన్నప్పుడు, పార్టీ స్ధాపించిన్నప్పుడు ఆయన వెంట లేని వారు వెన్నుపోటు గురించి మాట్లాడం హస్యాస్పదంగా ఉందన్నారు. ప్రజా సేవలో ఎప్పుడైన శిల్పా కుటుంబం ఉందా అని అఖిల ఎద్దేవా చేశారు. ఆళ్లగడ్డలో ఆర్టీసికి, ఇండోర్ స్టేడియంకు ఎకరా భూమిని దానం చేసిన ఘనత తమదిగా ఆమె చెప్పుకొచ్చారు.

ఎన్టీఆర్ వర్శిటీని వైఎస్స్ఆర్ గా పేరు మార్పు పై ప్రజల్లో నుండి వస్తున్న వ్యతిరేకతతో, వైకాపా మైండ్ గేంను ఎంచుకొనింది. అందుకే చిన్న చిన్న నేతలతో సహా మాజీ సీఎం చంద్రబాబును పదే పదే అవమానించడం, నందమూరి, నారా కుటుంబాల్లో చీలిక పై దృష్టి సారించేలా మాట్లాడుతున్నారు. వైకాపా ప్లాన్ బెడిసికొట్టడంతో పలు చోట్ల నేతలు అసహనానికి గురౌతున్నారు.

ఇది కూడా చదవండి: వైకాపాలో 80 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలు.. దేవినేని ఉమ

ఇవి కూడా చదవండి: