Last Updated:

ED raids: ఈడి దాడులు.. బయటపడ్డ నోట్ల కట్టలు

వెస్ట్ బెంగాల్ లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఓ వ్యాపారి పై దాడులు చేపట్టింది. భారీ మొత్తంలో నగదు పట్టుబడింది. గేమింగ్ యాప్ పేరుతో యూజర్లు నుండి డబ్బులు వసూలు చేస్తున్నారన్న కోణంలో ఇడి దర్యాప్తు చేపట్టిన కేసులో నోట్ల కట్టలు బయటపడ్డాయి.

ED raids: ఈడి దాడులు.. బయటపడ్డ నోట్ల కట్టలు

West Bengal: దేశంలో అక్రమంగా సంపాదించడం తేలికపాటిగా మారింది. ఎన్ని దాడులు చేపట్టినా, ఎంతమందిని జైళ్లకు పంపుతున్నా మార్పు అనేది కానరావడం లేదు. అయినా పట్టు వదలని విక్రమార్కుడిలా ఆర్ధిక నేరాల కట్టడి విభాగాలు తమ పని తాము చేసుకొంటూ పోతున్నాయి.

తాజాగా ఓ కేసు దర్యాప్తులో భాగంగా ఓ వ్యాపారి ఇంట్లో సోదాలు చేపట్టిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సిబ్బందికి కోట్లల్లో నోట్ల కట్టలు పట్టుబడ్డాయ్. వివరాల్లోకి వెళ్లితే. బెంగాల్ కు చెందిన ఇ-నగెట్స్ అనే సంస్ధ గేమింగ్ యాప్ మోసాలకు పాల్పొడుతూ యూజర్ల నుండి డబ్బులు వసూలు చేస్తున్నట్లు 2021లో ప్రమోటర్ల పై కోల్ కత్తా పోలీసులు కేసు నమోదు చేశారు.

మనీలాండరింగ్ కేసుగా పరిణగిస్తూ ఇడి దర్యాప్తు చేపట్టింది. ఇందులో భాగంగా ప్రమోటర్ అమీర్ ఖాన్ కు చెందిన 6 ప్రాంతాల్లో ఏక కాలంలో అధికారులు దాడులు చేపట్టారు. అతని ఇంట్లో లెక్కలేనన్ని నోట్ల కట్టలు బయట పడడంతో లెక్కింపు అనంతరం ఆ మొత్తం 7 కోట్ల మేర ఉన్నట్లు అధికారులు లెక్కకట్టారు. చైనాకు సంబంధించిన రుణ యాప్ లతో ఈ యాప్ ఏమైనా సంబంధం ఉందా అన్న కోణంలో కూడా దర్యాప్తు సాగుతున్నట్లు ఇడి వర్గాలు వెల్లడించాయి. అంతా ఆన్ లైన్ రూపంలో నగదు బ్యాంకులకు చేరితే ఏ విధంగా వాటిని నల్ల ధనంగా మార్చి ఇళ్ళలో దాచిపెడుతున్నారో అన్న కోణం పై కూడా ఇడి దృష్టి సారించింది.

ఇవి కూడా చదవండి: