Last Updated:

Mumbai Police: ముంబయిలో శాంతి భద్రతలకు విఘాతం.. నవంబర్ 1 నుండి కఠిన నిషేధాజ్ఞలు

ముంబయి నగర పోలీసులు కఠిన నిషేధాజ్ఞలు ప్రకటించారు. నవంబర్ 1 నుండి 15వరకు ఈ ఆదేశాలు అమలుకానున్నాయి. నగరంలో శాంతి భద్రతలకు విఘాతం, ప్రజల ప్రాణాలు, ఆస్తులకు ముప్పు పొంచి ఉందన్న సమాచారంతో నగర పోలీసులు అప్రమత్తమైనారు.

Mumbai Police: ముంబయిలో శాంతి భద్రతలకు విఘాతం.. నవంబర్ 1 నుండి కఠిన నిషేధాజ్ఞలు

Mumbai: ముంబయి నగర పోలీసులు కఠిన నిషేధాజ్ఞలు ప్రకటించారు. నవంబర్ 1 నుండి 15వరకు ఈ ఆదేశాలు అమలుకానున్నాయి. నగరంలో శాంతి భద్రతలకు విఘాతం, ప్రజల ప్రాణాలు, ఆస్తులకు ముప్పు పొంచి ఉందన్న సమాచారంతో నగర పోలీసులు అప్రమత్తమైనారు.

బహిరంగ ప్రదేశాల్లో ఐదుగురికి మించి గుమికూడడం, చట్టవిరుద్ధమైన ఊరేగింపులు, లౌడ్ స్పీకర్ల వాడకం, బాణసంచా కాల్చడాన్ని పూరిగా నిషేధించారు. మహారాష్ట్ర పోలీసు చట్టంలోని నిబంధనల ప్రకారం జారీ చేసిన ఉత్తర్వుల్లో వివాహాలు, అంత్యక్రియలు, క్లబ్బులు, కంపెనీలు, సహకార సంఘాలు, ధియేటర్లు, సినిమా హాళ్లలో సమావేశాలకు మాత్రం మినహాయింపు కల్పించారు.

దీంతో పాటుగా నవంబర్ 3 నుండి డిసెంబర్ 2 వరకు ఆయుధాల ప్రదర్శన, మందుగుండు సామగ్రి వినియోగం పైనా నిషేధం విధించారు. సామాజిక నైతికత, భద్రత, ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రమాదానికి దారితీసే ఫోటోలు, సింబల్స్, బోర్డులను రూపొందించడం, ప్రదర్శించడం పైనా నిషేదం విధిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. రెచ్చగొట్టే ప్రసంగాలు, పాటలు, సంగీతం వంటి వాటి పైనా నిషేధాజ్నలు వర్తిస్తాయని స్పష్టం చేశారు. ఉల్లంఘించిన వారి పై కఠిన చర్యలు తీసుకోనున్నారు.

ఇది కూడా చదవండి: Supreme Court: ద్వేషపూరిత ప్రసంగాలు సరికాదు.. సుప్రీంకోర్టు

ఇవి కూడా చదవండి: