Last Updated:

MLA Vallabhaneni Vamsi: ఎన్టీఆర్ పేరు మార్పు పై గందరగోళం

ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయం పేరు మార్పు పై రాష్ట్ర వ్యాప్తంగా గందరగోళం ఏర్పడింది. తెదేపా నేతలతోపాటుగా పలు అధికార పార్టీ నేతలు, ప్రతిపక్ష పార్టీలు ముక్త కంఠంతో నిరసిస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో గంధరగోళం పరిస్ధితులు ఏర్పడ్డాయి.

MLA Vallabhaneni Vamsi: ఎన్టీఆర్ పేరు మార్పు పై గందరగోళం

Amaravati: ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయం పేరు మార్పు పై రాష్ట్ర వ్యాప్తంగా గందరగోళం ఏర్పడింది. తెదేపా నేతలతోపాటుగా పలు అధికార పార్టీ నేతలు, ప్రతిపక్ష పార్టీలు ముక్త కంఠంతో నిరసిస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో గంధరగోళం పరిస్ధితులు ఏర్పడ్డాయి. పలువురు ఈ మేరకు జగన్ కు ట్వీట్ లు చేసి తమలోని మనోభావాలు చెప్పుకొంటున్నారు.

వైఎస్ఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయం గా శాసనసభలో బిల్లు ఆమెదం అయిన వెంటనే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఎన్టీఆర్ పేరుతో జిల్లా పేరు పెట్టి, నేడు వర్శిటీకి ఆయన పేరు లేకుండా ఉండడం పై ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్టీఆర్ చొరవతో ఏర్పాటైన ఆరోగ్య విశ్వ విద్యాలయానికి ఆయన పేరే కొనసాగించాలని ట్వీట్ చేశారు.

ఇప్పటివరకు ప్రతిపక్షం తెలుగుదేశంతో మైండ్ గేం ఆడిన పాలకపక్షం, దివంగత నేత, తెలుగు వారి హృదయాల్లో ప్రత్యేక స్ధానాన్ని సంపాదించిన నందమూరి తారక రామారావు పేరు మార్పు పై చేసిన అధికార పార్టీ ప్రయత్నాన్ని అన్ని వర్గాల నుండి వ్యతిరేకత వస్తుండడం పై వైసిపి పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకొంటారో వేచిచూడాల్సిందే.

ఇవి కూడా చదవండి: