Last Updated:

Viveka Murder Case: 6 నెలల తర్వాత కడపకు సీబీఐ

రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు వివేకానంద రెడ్డి హత్యపై సీబిఐకి సహకరించడం లేదు, కేసును మరో రాష్ట్రానికి తరలించాలంటూ వివేక కూతురు సుప్రీం కోర్టులో పిటిషన్ వేసిన వెంటనే సీబిఐ బృందం కడపలో విచారణ చేపట్టడం సర్వత్రా చర్చకు దారితీసింది

Viveka Murder Case: 6 నెలల తర్వాత కడపకు సీబీఐ

Andhra Pradesh: రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు వివేకానంద రెడ్డి హత్య పై సీబిఐకి సహకరించడం లేదు, కేసును మరో రాష్ట్రానికి తరలించాలంటూ వివేక కూతురు సుప్రీం కోర్టులో పిటిషన్ వేసిన వెంటనే సీబిఐ బృందం కడపలో విచారణ చేపట్టడం సర్వత్రా చర్చకు దారితీసింది.

సమాచారం మేరకు, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో 6 నెలల విరామం అనంతరం సీబిఐ విచారణ చేపట్టింది. వివేకా వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన ఇనయతుల్లాను సీబిఐ పులివెందులలోని ఆర్ అండ్ బీ అతిధి గృహంలో విచారించింది. సాక్షులు, సీబిఐ అధికారులను బెదిరిస్తున్నట్లుగా పేర్కొన్న సునీత పిటిషన్ పై అక్టోబర్ 14వ తేదీన సుప్రీం కోర్టుకు సీబిఐ, రాష్ట్ర ప్రభుత్వం తగిన సంజాయిషీ ఇవ్వాల్సి ఉంది.

ఈ క్రమంలో వివేక కేసులో పురోగతిని సాధించేందుకు ఇనయతుల్లాను సీబిఐ విచారించిన్నట్లు తెలుస్తుంది. వివేక దగ్గర ఇనయతుల్లా కంప్యూటర్ ఆపరేటర్ గా కూడా పనిచేసివున్నారు. హత్య జరిగిన 2019 మార్చి 19న వివేక మృతదేహానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు తీసింది ఇనయతుల్లానే. అయితే వాటిని ఎవరెవరికి షేర్ చేసారు అన్న కోణంలో విచారణ సాగిన్నట్లు సమాచారం. మరో వైపు ఫోటోలు తీస్తున్న సమయంలో ఇనయతుల్లాతోపాటు ఘటనా ప్రాంతంలో ఎవరు వున్నారు అన్న కోణంలో కూడా సీబీఐ కూపీ లాగింది. ఇప్పటికే పలు మార్లు అతన్ని విచారించి వుంది. తాజాగా కడప నుండి ప్రత్యేకంగా పులివెందులకు వచ్చి ఇనయతుల్లాను విచారించడం పై సీబిఐ కీలక సమాచారాన్ని సేకరించిందని తెలుస్తుంది.

ఏది ఏమైనా, ఏపిలో వ్యవస్ధలు సరిగా పనిచేయడం లేదు. దీంతో న్యాయం కోసం ప్రజలు ఎదురు చూడాల్సిన పరిస్ధితి ఎదురౌతుంది. గతంలో వివేకనంద రెడ్డి హత్యలో తెలుగుదేశం నేతలకు ఉందని వ్యాఖ్యానించిన నేటి ప్రభుత్వ పెద్దలు, అధికారంలోకి వచ్చిన తర్వాత వివేకా హత్య కేసును నీరు గార్చడం పట్ల పలు అనుమానాలకు తావిస్తుంది. మరో వైపు తెదేపా కూడా వివేకా హత్య పై అసలు విషయం బయటపెట్టాలంటూ పదే పదే పేర్కొనడం పట్ల అధికార పార్టీ శ్రేణుల్లో ఒణుకు ప్రారంభమైంది. మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో వివేక హత్య ఎవరి మెడకు చుట్టుకుంటుందోనని ప్రధాన రాజకీయ నేతల్లో కలవరం మొదలైంది.

ఇవి కూడా చదవండి: