Last Updated:

Supreme Court: సుప్రీం కోర్టులో ఉద్ధవ్ ఠాక్రేకు ఎదురుదెబ్బ

మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ధాకరేకు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. నిజమైన శివసేనను నిర్ణయించే అధికారాన్ని ఎన్నికల కమిషన్ చర్యలపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది

Supreme Court: సుప్రీం కోర్టులో ఉద్ధవ్ ఠాక్రేకు ఎదురుదెబ్బ

New Delhi: మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ధాకరేకు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. నిజమైన శివసేనను నిర్ణయించే అధికారాన్ని ఎన్నికల కమిషన్ చర్యల పై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. తొలిసారిగా ప్రత్యక్ష ప్రసారాలతో వాదోపవాదాలు జరిగిన కేసులో ధర్మాసనం ఎన్నికల కమీషన్ కు బాధ్యతలను అప్పగిస్తూ తీర్పునిచ్చింది.

వివరాల మేరకు, నిజమైన శివసేన పార్టీ మాదే నంటూ ఏక్ నాధ్ షిండే వర్గం ఎన్నికల కమీషన్ ను ఆశ్రయించివుంది. దీంతో ఉద్ధవ్ ధాకరే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసారు. షిండే వర్గాన్ని నిజమైన శివసేనగా గుర్తించకుండా ఈసీని నిరోధించాలంటూ ధాకరే వర్గం కోరింది. అయితే ఆ ప్రొసీడింగ్స్ పై స్టే ఇవ్వలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. నిజమైన శివసేన ఎవరికి చెందుతుందో, ఎవరికి పార్టీ గుర్తు కేటాయించాలో నిర్ణయించే అధికారం ఈసీకి ఇస్తూ సుప్రీం కోర్టు అనుమతించింది. సుప్రీం తీర్పు పై షిండే వర్గం పెద్ద విజయంగా భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి:  నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. తెలంగాణలో మరో ఉద్యోగ నోటిఫికేషన్

ఇవి కూడా చదవండి: