Last Updated:

Namaz: రైలులో నమాజ్ చేయడంపై అధికారులకు బీజేపీ నేత ఫిర్యాదు

ప్రయాణిస్తున్న రైలులో నలుగురు వ్యక్తులు నమాజ్ చేస్తూ ఇతరులను ఇబ్బందులకు గురిచేసారంటూ యూపీ మాజీ ఎమ్మెల్యే ఒకరు రైల్వే అధికారులకు ఫిర్యాదు చేసారు.

Namaz: రైలులో నమాజ్ చేయడంపై అధికారులకు  బీజేపీ నేత ఫిర్యాదు

Namaz: ప్రయాణిస్తున్న రైలులో నలుగురు వ్యక్తులు నమాజ్ చేస్తూ ఇతరులను ఇబ్బందులకు గురిచేసారంటూ యూపీ మాజీ ఎమ్మెల్యే ఒకరు రైల్వే అధికారులకు ఫిర్యాదు చేసారు. యూపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే దీప్లాల్ భారతి అక్టోబర్ 20న తాను సత్యాగ్రహ్ ఎక్స్ ప్రెస్ లో ప్రయాణించినపుడు స్లీపర్ క్లాసులో నలుగురు వ్యక్తులు ఒకరి తరువాత ఒకరు కూర్చుని నమాజ్ చేసారని తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయన జత చేసారు.

దీనివలన రైలులో ప్రయాణీకులు అటు ఇటు తిరగడానికి ఇబ్బందులు పడ్డారని ఆయన తెలిపారు. ఎవరైనా ఆ ప్రాంతాన్ని దాటడానికి ప్రయత్నిస్తున్నపుడు వారు వారిని వేచి ఉండాలని చెప్పారని అన్నారు. అంతేకాదు కోచ్‌కు రెండు వైపులా ఇద్దరు వ్యక్తులను ఉంచారని, కోచ్‌లోకి ప్రవేశించకుండా లేదా బయటకు వెళ్లకుండా ప్రజలను ఆపివేసినట్లు ఆయన తెలిపారు. దీనిపై మాజీ ఎమ్మెల్యే రైల్వే అధికారులకు ఫిర్యాదు చేసి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.

గతంలో, లక్నోలోని లులు మాల్ ప్రాంగణంలో ప్రజలు నమాజ్ చేయడంపై పెద్ద వివాదం చెలరేగింది. అయితే మాల్ అధికారులు వెంటనే స్పందించి అటువంటి సంఘటనలు జరగకుండా చూసుకున్నారు.

ఇవి కూడా చదవండి: