Last Updated:

PM Narendra Modi: ప్రార్ధనా స్థలాలకు పూర్వ వైభవం తీసుకొచ్చిన ఘనత భాజపాదే.. ప్రధాని మోదీ

గత పాలకులు ప్రార్ధనా స్ధలాలను ఏళ్ల తరబడి నిర్లక్ష్యానికి గురి చేశారని, నేటి కేంద్ర ప్రభుత్వం వాటికి పూర్వ వైభవం తీసుకొచ్చిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఉత్తరాఖండ్ పర్యటనలో భాగంగా మనా గ్రామంలో ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో ప్రధాని ప్రసంగించారు

PM Narendra Modi: ప్రార్ధనా స్థలాలకు పూర్వ వైభవం తీసుకొచ్చిన ఘనత భాజపాదే.. ప్రధాని మోదీ

Dehradun: గత పాలకులు ప్రార్ధనా స్ధలాలను ఏళ్ల తరబడి నిర్లక్ష్యానికి గురి చేశారని, నేటి కేంద్ర ప్రభుత్వం వాటికి పూర్వ వైభవం తీసుకొచ్చిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఉత్తరాఖండ్ పర్యటనలో భాగంగా మనా గ్రామంలో ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో ప్రధాని ప్రసంగించారు.

కాశీ విశ్వనాధ ఆలయం, ఉజ్జయిని మహంకాళి ఆలయం, అయోధ్యలో రామ మందిరం తదితర మహన్నత క్షేత్రాల పునర్ నిర్మాణం పనులు భాజపా హయాంలోనే సాగుతున్నాయని ప్రధాని గుర్తు చేశారు. గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయడం పట్ల బానిస మనస్తత్వానికి నిదర్శనంగా మోదీ పేర్కొన్నారు.

ప్రఖ్యాతగాంచిన కేదార్నాధ్, బద్రీనాధ్ ఆలయాలను ప్రధాని సందర్శించారు. అనంతరం భారత్-చైనా సరిహద్దులోని రెండు రోప్ వే రహదారి పనులకు ఆయన శంకుస్ధాపన చేశారు. వారసత్వ సంపద పట్ల మనకున్న అపారమైన ప్రేమ, అభివృద్ధి దిశగా మనం వేసే ప్రతి అడుగు నవభారత్ కు పునాదిగా అభివర్ణించారు.

మోదీ తన పర్యటనలో పర్యాటకులకు ఓ విజ్నప్తి చేశారు. వివిధ ప్రాంతాలను సందర్శించే క్రమంలో పెడుతున్న ఖర్చులో 5శాతం స్థానిక ఉత్పత్తులను కొనుగోలుకు కేటాయించాలని కోరారు. స్థానిక ఆర్ధిక వ్యవస్ధను నిలబెట్టేందుకు స్వదేశీ ఉత్పత్తులనే కొనుగోలు చేయాలని ఈ సందర్భంగా మోదీ పిలుపునిచ్చారు.

ఇది కూడా చదవండి:PM Modi: చోలా దొరను ధరించి కేథారనాథుడిని దర్శించిన మోది

ఇవి కూడా చదవండి: