Site icon Prime9

ఛార్లెస్ శోభరాజ్: అతను ఎందుకు “బికినీ కిల్లర్” గా మారాడో తెలుసా.. ఛార్లెస్ శోభరాజ్ ఎన్ని హత్యలు చేశాడంటే..?

bikini killer charles shobraj released from nepal govt

bikini killer charles shobraj released from nepal govt

Charles Shobaraj: పలు దేశాల్లోని పర్యాటకులకు చార్లెస్ శోభరాజ్ పేరు వింటేనే వెన్నులో వణుకు పుట్టుకొస్తోంది. 20కుపైగా హత్యలు చేసిన కరుడుగట్టిన నేరస్థుడు అతను. వరుస హత్యలతో పలు దేశాల పోలీసులకు సవాల్ విసిరిన ఈయనపై కేసులు కూడా నమోదయ్యాయి. ఈయనను అందరూ బికినీ కిల్లర్ అని కూడా పిలుస్తారు. మరి ఇంతకీ చార్లెస్ కు ఈ పేరు ఎలా వచ్చింది.. ఆయన ఎన్ని హత్యలు చేశాడు.. ప్రస్తుతం ఈయన్ను నేపాల్ ప్రభుత్వం ఎందుకు విడుదల చేసింది, అనే అంశాలను తెలుసుకుందాం.

 

చిన్ననాటి నుండే నేరాలు

శోభరాజ్‌ తండ్రి భారత్‌కు చెందినవాడు కాగా, తల్లి వియత్నాంకు చెందినవారు. వియాత్నంలోని హూచిమిన్ నగరంలో చార్లెస్ శోభరాజ్ 1944లో జన్మించారు. ఫ్రాన్స్‌లో పెరిగిన శోభరాజ్‌ చిన్నచిన్న నేరాలు చేస్తూ పలుమార్లు జైలుపాలయ్యాడు. చిన్నతనం నుండే నేరప్రవృత్తి కలిగి ఉండి.. 20పైగా హత్యలు చేసి దాదాపు అనేక సంవత్సరాలు జైలు జీవితం గడిపాడు. ఇందులో 14 హత్యలు థాయ్‌లాండ్‌లో చేశాడు. 1970లో ప్రపంచ పర్యటన ప్రారంభించిన అతడు బ్యాంకాక్‌కు చేరాడు. పశ్చిమ దేశాలకు చెందిన పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని, వారితో చనువు పెంచుకొని, డ్రగ్స్‌ ఇచ్చి హత్య చేసేవాడు. అతనిపై తొమ్మిది దేశాల్లో హత్యకేసులు ఉన్నాయి. భారత్ సహా నేపాల్, మయన్మార్, థాయ్‌లాండ్, ఫ్రాన్స్, గ్రీస్, టర్కీ వంటి తొమ్మిది దేశాల పోలీసులు చార్లెస్ కోసం వెతికిన సందర్భాలు లేకపోలేదు. అలాంటి ఈ సీరియల్ కిల్లర్‌, 78 ఏళ్ల చార్లెస్ శోభరాజ్ ను ప్రస్తుతం నేపాల్ ప్రభుత్వం విడుదల చేసింది.

1975లో అమెరికన్ టూరిస్ట్ కొన్నీ జో బ్రోంజిచ్‌ మరియు అతని భార్యను హత్యచేసినందుకు గానూ చార్లెస్ శోభరాజ్‌కు నేపాల్ న్యాయస్థానం 2003లో జీవిత ఖైదును విధించింది. ప్రస్తుతం అతను నేపాల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. కాగా 78ఏళ్ల వయస్సున్న చార్లెస్ అనారోగ్యకారణంగా ఇబ్బంది పడుతుండటంతో నేపాల్ సుప్రీంకోర్టు అతడిని విడుదల చేయాలని ఆదేశించింది. అంతే కాకుండా చార్లెస్ కు వ్యతిరేకంగా పెండింగ్ కేసులేమీ లేకపోతే అతన్ని వెంటనే విడుదల చేసి 15రోజుల్లోపు చార్లెస్ ను అతని సొంత దేశానికి పంపించాలని నేపాల్ సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చింది.

ఇదిలా ఉంటే చార్లెస్ 1976 నుంచి 1997 వరకు భారత్ లో చార్లెస్ జైలు జీవితాన్ని అనుభవించాడు. ఢిల్లీలో ఓ ఫ్రెంచ్ పౌరుడికి విషం ఇచ్చి హత్య చేసిన కేసులో చార్లెస్ ను ఇండియన్ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే 1986లో ఓసారి జైలు నుంచి తప్పించుకున్నప్పటికీ అతన్ని పోలీసులు గుర్తించి మళ్లీ జైలుకు పంపించారు.

చార్లెస్ కు ‘ బికినీ కిల్లర్’ అనే పేరు
చార్లెస్ బీచ్‌లలో బికినీ ధరించిన టూరిస్ట్ అమ్మాయిలను ఎక్కువగా చంపేవాడు. అందుకే అతన్ని బికినీ కిల్లర్ అని కూడా పిలుస్తారు.

70వ దశకంలో చార్లెస్ ఎక్కువగా ఆగ్నేయాసియాలో 12 మంది పర్యాటకులను హత్యచేశాడు. నీటిలో ముంచడం, గొంతు నులిమి చంపడం, కత్తితో పొడిచి చంపడం లేదా సజీవదహనం చేయడం వంటి పద్ధతులను ఉపయోగించి చార్లెస్ ఎక్కువగా హత్యలు చేసేవాడు. ఈయన జీవిత కథ ఆధారంగా నాన్ ఫిక్షన్ పుస్తకాలు, నెట్ ఫ్లిక్స్ లో సర్పెంట్ అనే వెబ్ సిరీస్ లు సైతం విడుదలయ్యాయి.

ఇదీ చదవండి: వేలకోట్లు రుణాలు తీసుకుని బ్యాంకులకు టోపీ పెట్టిన టాప్ 10 సంస్దలు ఏమిటో తెలుసా ?

Exit mobile version
Skip to toolbar