Last Updated:

Bhuvan technique: గణేష్ నిమజ్జంలో భువన్ సాంకేతికత

గణేష్ నిమజ్జనం వేడుకలను అత్యంత వైభవంగా చేపట్టే ప్రాంతాల్లో ఢీల్లీ తర్వాత హైదరాబాదుకు ప్రత్యేక స్థానం ఉంది. లక్షలాది వినాయక విగ్రహ ప్రతిమలను ఊరేగింపు అనంతరం ఆయా ప్రాంతాల్లో కేటాయించిన ప్రదేశాల్లో గణనాధుడిని నిమజ్జనం చేస్తుంటారు. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వం ఎంతో వ్యయప్రయాశలతో నిమజ్జన వేడుకలను విజయవంతం చేసేందుకు కీలక వ్యవస్ధలను ఉపయోగించుకొనింది.

Bhuvan technique: గణేష్ నిమజ్జంలో భువన్ సాంకేతికత

Bhuvan technique in Ganesh immersion: ఈ క్రమంలో ఇస్రో కేంద్రాల్లో ఒకటైన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ కు చెందిన భువన్ సాంకేతికతను నిమజ్జనం వేడుకల్లో వినియోగించిన్నట్లు ఇస్రో పేర్కొనింది. వాహానాలను ట్రాకింగ్ చేస్తూ దాని స్థాన స్ధితిగతులను తెలుసుకొనేందుకు అవసరమైన సాంకేతికతను అందించండి అంటూ హైదరాబాద్ సిటీ పోలీసులు ఎన్ఆర్ఎస్సీని సంప్రదించారు. దీంతో వాహన ట్రాకింగ్ ను అమలు చేయడానికి మొబైల్ ఆధారిత భువన్ స్మార్ట్ ట్రాకింగ్ అప్లికేషన్ ను ప్రత్యేకంగా శాస్త్రవేత్తలు రూపొందించారు. నిమజ్జనం కోసం జంట నగరాల్లోని అన్ని ప్రాంతాల నుండి ప్రారంభమయ్యే వాహనాల ప్రక్రియను వీడియో, పర్యవేక్షణ, నిర్వహణకు సంబంధించి రియల్ టైం డాటా సిస్టంను హైదరాబాదు పోలీసులకు నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ అందించింది. దీంతో ఏదేని సందర్భాలలో త్వరితగతిన సమాచారాన్ని అందుకొనేందుకు, తగిన సూచనలు ఇచ్చేందుకు భువన్ సాంకేతికత పోలీసులకు ఉపయోగపడిందని ఇస్రో తెలిపింది.

భువన్ సర్వర్ కు వాహనాల స్ధాన సమాచారాన్ని తెలియచేసేలా మొబైల్ ఆండ్రాయిడ్ అప్లికేషన్ అనుసంధానం చేసారు. దీంతో వాహన ప్రయాణాన్ని తెలిపే స్థాన సమచారాన్ని భువన్ పోర్టల్ లో బ్రౌజర్ అప్లికేషన్ సాయంతో వీడియోను సైతం సేకరించేలా శాస్త్రవేత్తలు రూపుదిద్దారు.

ఇప్పటివరకు దేశ భూభాగం మీద ఏర్పడే సహజ వనరుల నిర్వహణ, విపత్తు నిర్వహణ మద్దతు, భూమి, వాతావరణానికి సంబంధించిన భౌగోళిక-ప్రాదేశిక సేవల కొరకు భువన్ సాంకేతికత ద్వార 2డి, 3డి మ్యాప్ లను నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ సేకరించి ఇస్రో శాస్త్రవేత్తలకు అందచేస్తుంటుంది.

ఇవి కూడా చదవండి: