Last Updated:

Madhya Pradesh: రక్తమోడిన రోడ్డు.. 11 మంది స్పాట్ డెడ్

అతివేగంతో వస్తున్న కారు అదుపు తప్పి ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో 11 మంది మరణించారు. ఈ ఘటన శుక్రవారం తెల్లవారు జామున మధ్యప్రదేశ్‌లో బేతుల్ జిల్లాలో చోటుచేసుకుంది.

Madhya Pradesh: రక్తమోడిన రోడ్డు.. 11 మంది స్పాట్ డెడ్

Madhya Pradesh: అతివేగంతో వస్తున్న కారు అదుపు తప్పి ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో 11 మంది మరణించారు. ఈ ఘటన శుక్రవారం తెల్లవారు జామున మధ్యప్రదేశ్‌లో బేతుల్ జిల్లాలో చోటుచేసుకుంది.

మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బేతుల్ జిల్లాలోని ఝల్లార్ పోలీస్ స్టేషన్ సమీపంలో వేగంగా వస్తున్న కారు అదుపుతప్పి బస్సును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 11 అక్కడికక్కడే మృతి చెందగా ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులంతా కారులో ప్రయాణిస్తున్న వారే కావడం గమనార్హం. మృతుల్లో ఆరుగురు పురుషులు, ముగ్గురు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారని పోలీసులు వెల్లడించారు. చనిపోయిన వారంతా కూలీలేనని వారంతా మహారాష్ట్ర నుంచి మధ్యప్రదేశ్ వస్తున్నారని తెలిపారు.అయితే బస్సులో మాత్రం ఎవరూ ప్రయాణికులు లేరని ఖాళీగా వస్తోందని అధికారులు పేర్కొన్నారు.

బస్సును ఢీకొట్టిన తర్వాత కారు నుజ్జునుజ్జయింది. బస్సు మాత్రం స్వల్పంగా ధ్వంసమైంది. ప్రమాద సమయంలో కారులో 12 మంది ఉన్నారని తెలిపారు. కారు డ్రైవర్ నిద్ర మత్తులో ఉండడం వల్లే ఈ ఘోర ప్రమాదం జరిగినట్లుగా ప్రాథమిక సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు బేతుల్ ఎస్పీ సిమ్లా ప్రసాద్ తెలిపారు.

ఇదీ చదవండి: ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి.. 40 మందికి గాయాలు

ఇవి కూడా చదవండి: