Last Updated:

Aaron Finch: వన్డే ఫార్మాట్ కు రిటైర్మెంట్ ఇచ్చిన ఆరోన్ ఫించ్

ఆస్ట్రేలియా బ్యాటర్‌ మరియు కెప్టెన్ అయిన ఆరోన్ ఫించ్ వన్డేలకు స్వస్తి పలుకనున్నారు. ఆదివారం నాడు న్యూజిలాండ్‌తో జరిగే మూడో వన్డేలో పాల్గొనిన అనంతరం ఈ ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ఇవ్వనున్నాడు.

Aaron Finch: వన్డే ఫార్మాట్ కు రిటైర్మెంట్ ఇచ్చిన ఆరోన్ ఫించ్

Australia: ఆస్ట్రేలియా బ్యాటర్‌ మరియు కెప్టెన్ అయిన ఆరోన్ ఫించ్ వన్డేలకు వీడ్కోలు పలికారు. ఆదివారం నాడు న్యూజిలాండ్‌తో జరిగే మూడో వన్డేలో పాల్గొని అనంతరం ఈ ఫార్మాట్‌కు స్వస్తి పలుకనున్నాడు.

ప్రస్తుతం ఫించ్ ఆసిస్ టీ20 జట్టుకు కెప్టెన్ గా కొనసాగనున్నాడు. గతేడాది ఫించ్ సారథ్యంలోనే ఆస్ట్రేలియా టీ20 ప్రపంచకప్‌ను మొట్ట మొదటిసారిగా కైవసం చేసుకుంది. కాగా ఫించ్ తన కెరీర్‌లో చివరి 146వ వన్డే మ్యాచ్‌ని న్యూజిలాండ్‌తో ఆదివారం నాడు ఆడనున్నాడు. ఫించ్ తన కెరీర్ మొత్తంలో 54 వన్డే మ్యాచ్‌లకు కెప్టెన్సీ చేపట్టాడు. 50 ఓవర్ల మ్యాచ్‌ల్లో మొత్తం 17 సెంచరీలు కొట్టాడు.

ఈ సీజన్‌లో జరిగిన వన్డే మ్యాచుల్లో సరైన పర్ఫర్మెన్స్ ఇవ్వలేని కారణంగా ఫించ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ సీజన్లో జరిగిన వన్డేల్లో తన చివరి ఏడు ఇన్నింగ్స్‌లకు గానూ కేవలం 26 పరుగులు మాత్రమే చేశాడు. 2023లో ఇండియాలో జరిగే వన్డే ప్రపంచకప్‌లో తమ జట్టుకు సారథిగా వహించడమే తన లక్ష్యమని చెప్పిన ఫించ్ తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. వన్డేలకు కొత్త కెప్టెన్‌కు అవకాశం ఇవ్వాలని ఆదేశ క్రికెట్ బోర్డును కోరారు. తద్వారా వరల్డ్ కప్ ప్రాక్టీస్ కు తగిన సమయం దొరుకుతుందన్నాడు. ‘ఇది కొన్ని అద్భుతమైన జ్ఞాపకాలతో కూడిన సుందర ప్రయాణం. ఈ అద్భుతమైన వన్డే జట్టులో భాగమైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రయాణంలో నాకు సహకరించిన వారందరికీ నా ధన్యవాదాలు’ అని ఫించ్‌ ప్రకటనలో తెలిపాడు. ఈ ప్రకటన అనంతరం ఆసిస్ వన్డే కెప్టెన్సీ పగ్గాలు ఎవరు స్వీకరిస్తారా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ రేసులో స్టీవ్‌స్మిత్‌, డేవిడ్‌ వార్నర్‌లు ముందంజలో ఉన్నారు.

ఇదీ చూడండి: నీరజ్ కు డైమండ్ దాసోహం

ఇవి కూడా చదవండి: