Last Updated:

Hemant Soren: దమ్ముంటే అరెస్ట్ చేయాలి.. జార్ఖండ్ సీఎం

జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి సవాల్ విసిరారు. నేరం చేసి ఉంటే తనను అరెస్ట్ చేయాలన్నారు. అంతేకానీ తనను ప్రశ్నించేలా ఎన్‌ఫోర్స్‌‌మెంట్ డైరెక్టరేట్ ను ప్రోత్సహించవద్దని అన్నారు

Hemant Soren: దమ్ముంటే అరెస్ట్ చేయాలి.. జార్ఖండ్ సీఎం

Ranchi: జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి సవాల్ విసిరారు. నేరం చేసి ఉంటే తనను అరెస్ట్ చేయాలన్నారు. అంతే కానీ తనను ప్రశ్నించేలా ఎన్‌ఫోర్స్‌‌మెంట్ డైరెక్టరేట్ ను ప్రోత్సహించవద్దని అన్నారు. చట్ట విరుద్ధ గనుల తవ్వకం కేసులో మనీలాండరింగ్ జరిగినట్లు ఆరోపిస్తూ ఈడీ ఆయనకు సమన్లను జారీ చేసింది. గురువారం హాజరుకావాలని సమన్లలో ఆదేశించినప్పటికీ ఆయన ఈడీ అధికారుల వద్ద హాజరు కాలేదు.

ఈ క్రమంలో సీఎం సొరేన్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, తాను ఛత్తీస్‌గఢ్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొనవలసిన రోజునే (గురువారం) హాజరుకావాలని ఈడీ సమన్లను జారీ చేసిందన్నారు. ఈడీ కార్యాలయం వద్ద భద్రతను పెంచారన్నారు. స్థానిక జార్ఖండీలంటే భయపడుతున్నారా? అని ప్రశ్నించారు. నేను అంత పెద్ద నేరం చేసి ఉంటే, అరెస్టు చేయండి. ప్రశ్నించడం ఎందుకు? అని సోరెన్ అన్నారు.

ఇది కూడా చదవండి: Gujarat Assembly Elections: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

ఇవి కూడా చదవండి: