Last Updated:

Nine Years Girl Rape: దారుణం.. తొమ్మిదేళ్ల బాలికని వదలని కామాంధుడు

దేశంలో రోజురోజుకి మహిళలు, బాలికలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. చిన్నాపెద్ద తేడాలేకుండా పసికందు నుంచి పండు ముసలివాళ్లను సైతం మృగాళ్లు విడిచిపెట్టడం లేదు. మనిషి అని మర్చిపోయిన కామాంధుల కీచక కార్యకలాపాలకు చిన్న పిల్లలు బలైపోతున్నారు. ఈ క్రమంలోనే  తొమ్మిదేళ్ల బాలికపై ఓ కీచకుడు పేట్రేగిపోయాడు. చిన్నపిల్ల అని కూడా చూడకుండా ఆ చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన ఘటన తాజాగా రంగారెడ్డి జిల్లాలో జరిగింది.

Nine Years Girl Rape: దారుణం.. తొమ్మిదేళ్ల బాలికని వదలని కామాంధుడు

Nine Years Girl Rape: దేశంలో రోజురోజుకి మహిళలు, బాలికలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. చిన్నాపెద్ద తేడాలేకుండా పసికందు నుంచి పండు ముసలివాళ్లను సైతం మృగాళ్లు విడిచిపెట్టడం లేదు. మనిషి అని మర్చిపోయిన కామాంధుల కీచక కార్యకలాపాలకు చిన్న పిల్లలు బలైపోతున్నారు. ఈ క్రమంలోనే  తొమ్మిదేళ్ల బాలికపై ఓ కీచకుడు పేట్రేగిపోయాడు. చిన్నపిల్ల అని కూడా చూడకుండా ఆ చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన ఘటన తాజాగా రంగారెడ్డి జిల్లాలో జరిగింది.

రంగారెడ్డి జిల్లా మైలార్ దేవ్‌పల్లిలో తొమ్మిదేళ్ల బాలికపై అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న బీహార్​కి చెందిన దేవదాస్​ అనే యువకుడు అత్యాచారానికి ఒడిగట్టాడు.
కాగా బాలిక గత రెండు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు గమనించిన తల్లీదండ్రులు బాలికను ఆరాతీయగా ఏడుస్తూ అసలు విషయం చెప్పింది.
తల్లిదండ్రులు ఓ పరిశ్రమలో పనికి వెళ్లిన సమయంలో ఇంటి పక్కనే ఉన్న దేవదాస్​ తరచూ బాలికపై అత్యాచారానికి పాల్పడినట్టు బాలిక తల్లిదండ్రులకు వివరించింది.
ఈ విషయమై వారు పోలీసులను ఆశ్రయించారు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసుకున్న పోలీసులు యువకుడుని అదుపులోనికి తీసుకొని విచారణ జరుపుతున్నారు.

ఇదీ చదవండి: Viral News: ఏడాదిన్నరగా ఇంట్లోనే డెడ్ బాడీ.. తీరా చూస్తే ఘోరం..!

ఇవి కూడా చదవండి: