Breaking News

చైనాకు కోల్డ్‌వార్‌ లేదా హాట్‌ వార్‌ అవసరం లేదు.. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్

23 rd Sep 2020, UTC

బీజింగ్ :కోల్డ్‌వార్‌ లేదా హాట్‌ వార్‌ లాంటివి తమకు అవసరం లేదంటూ చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ వ్యాఖ్యానించారు. ఐక్యరాజ్యసమితి 75వ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ చైనా ఎప్పుడూ ఆధిపత్యాన్ని కోరుకోదని అన్ని దేశాలతో శాంతియుత, సహకార సంబంధాలకు కట్టుబడి ఉందన్నారు.తూర్పు లఢాఖ్‌లోని చైనా, భారత్‌సైన్యాల మధ్య గత నాలుగు నెలుగా ప్రతిష్టంభన కొనసాగుతున్న నేపథ్యంలో జిన్ పింగ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

చైనా ఆర్థిక వృద్ధితో పాటు, ప్రపంచ ఆర్థిక వృద్ధికి తోడ్పాటునందిస్తుందని ఆయన అన్నారు. వివిధ దేశాలతో ఉన్న వివాదాలను చర్చల ద్వారా, సంభాషణల ద్వారా తగ్గించుకుంటామని అన్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి విషయంలో చైనాపై అంతర్జాతీయంగా వస్తున్న ఆరోపణలను తోసిపుచ్చారు. వైరస్‌ను ఎదుర్కోవడానికి అన్ని దేశాలు సమిష్టిగా ముందుకురావాలి. ఈ మహమ్మారిని అధిగమించడానికి అంతర్జాతీయంగా ఉమ్మడిగా ప్రణాళికను రూపొందించాలి. సమస్యను రాజకీయం చేయడం సరైన విధానం కాదన్నారు. కోవిడ్‌ వ్యాప్తి నేపథ్యంలో యూఎన్‌ సర్వసభ్య సమావేశాలను వర్చువల్‌ విధానంలో నిర్వహించారు. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox