Breaking News

దశాబ్దాల పాటు కరోనా ప్రభావం :డబ్ల్యూహెచ్‌వో

01 st Aug 2020, UTC

జెనీవా :మానవ జీవితంలో కరోనా మహమ్మారి వచ్చిన తరువాత పరిస్థితులన్నీ మారిపోయాయి. అయితే ఈ ప్రభావం దశాబ్దాల పాటు ఉంటుందని డబ్ల్యు హెచ్ ఓ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధానోమ్‌ ఓ అంచనాకి వచ్చారు. వైరస్‌ వెలుగులోకి వచ్చి ఆరు నెలలు పూర్తయిన సందర్భంగా సంస్థ అత్యవసర విభాగం మరోసారి సమావేశమైంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులపై సమీక్షా నిర్వహించారు.18 మంది సభ్యులు, 12 మంది సలహాదారులు ఉన్నఈ బృందం వరుసగా నాలుగోసారి సమీక్షా నిర్వహించింది.
         మాస్కులు ధరించడం, శానిటైజర్ల వాడకం, భౌతిక దూరం పాటించడం, సామూహిక ప్రదేశాలను మూసివేయడం వంటి చర్యలను కొనసాగించే విషయంపై కమిటీ సంస్థకు కొన్ని సిఫార్సులు చేసింది.  భవిష్యత్ లో తీసుకోవాల్సిన చర్య ల విషయమై కూడా ఈ కమిటీ చర్చలు జరిపింది. చైనా వెలుపల 100 కేసులు, అసలు మరణాలే లేని సమయంలో ప్రపంచ ఆరోగ్య అత్యయిక స్థితి(పబ్లిక్‌ హెల్త్‌ ఎమర్జెన్సీ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ కన్‌సర్న్‌ పీహెచ్‌ఈఐసీ) ప్రకటించాల్సి వచ్చిందని అధానోమ్‌ గుర్తుచేశారు.
           శతాబ్దానికోసారి ఇలాంటి పరిస్థితులొస్తాయని .. దశాబ్దాల పాటు వాటి ప్రభావం ఉంటుంది అని చెప్పుకొచ్చారు. అయితే అత్యవసర పరిస్థితి ని ఇదే తరహా లో కొనసాగిస్తారా లేదా? అన్న దానిపై స్పష్టత రాలేదు. కరోనా విషయంలో శాస్త్రసంబంధమైన అనేక సమస్యలకు పరిష్కారం లభించిందని. ఇంకా అనేక వాటికి సమాధానం దొరకాల్సి ఉందన్నారు. అయితే వైరస్ ముప్పు మాత్రం తొలగినట్లు కాదని  పేర్కొన్నారు. ఒకసారి కరోనా సోకి తగ్గుముఖం పట్టిన ప్రాంతాల్లో కూడా కరోనా ప్రభావం మరో సారి విజృంభించే ప్రమాదం కూడా ఉండొచ్చని ఈ బృందం అభిప్రాయపడింది. తగ్గుముఖం పట్టిందని ఊపిరి పీల్చుకుంటున్న దేశాల్లో మరోసారి విజృంభిస్తోందని అధానోమ్‌ గుర్తుచేశారు. తొలినాళ్లలో పెద్దగా ప్రభావానికి గురికాని దేశాలు సైతం ఇప్పుడు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాయని చెప్పుకొచ్చారు.
            పీహెచ్‌ఈఐసీని ప్రకటించడంలో సంస్థ జాప్యం చేసిందన్న ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే.  అమెరికా అయితే.. డబ్ల్యూహెచ్ఓ కావాలనే చైనా తో జట్టుకట్టి తాత్సారం చేసిందని ఆరోపణలు గుప్పించింది. ఏకం గా డబ్ల్యూహెచ్ఓ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించింది.  మరిన్ని వార్తలు చదవండి. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox