Breaking News

నేడు మాల్యా ను భారత్ కు అప్పగించేందుకు సిద్ధమైన బ్రిటన్..!

04 th Jun 2020, UTC
నేడు మాల్యా ను భారత్ కు అప్పగించేందుకు సిద్ధమైన బ్రిటన్..!

వేల కోట్ల రుణాలను ఎగ్గొట్టిన విజయ్ మాల్యా భారత్ నుంచి విదేశాలకు చెక్కేసిన సంగతి తెలిసిందే. అయితే.. అప్పటి నుంచి విజయ్ మాల్యా ను వెనక్కి తీసుకురావడానికి ఈడీ, సిబిఐ వర్గాలు కసరత్తులు చేస్తున్నాయి. అయితే.. బ్రిటన్ మాల్యా ను తిరిగి అపపగించడానికి రంగం సిద్ధం చేసింది. ఇందుకు సంబంధించి న్యాయ ప్రక్రియ పూర్తి అయింది. నేడే మాల్యా ను భారత్ కు తీసుకురానున్నారని సమాచారం. అయితే.. తనను భారత్ కు అప్పగించవద్దంటూ... మాల్యా యుకె సుప్రీం కోర్ట్ లో వేసిన పిటిషన్ ను అక్కడి సుప్రీం కొట్టివేసింది. 9 వేల కోట్ల రుణాల ఎగవేత కు స్కెచ్ వేసిన విజయ్ మాల్యా పై ఇప్పటికే.. చీటింగ్, మనీ లాండరింగ్ కేసులు నమోదు అయినా సంగతి తెలిసిందే. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox