Breaking News

ఈ అమ్మాయి వంద రోజులు ఒక్కటే డ్రెస్ వేసుకుంది..ఎందుకంటే..?

10 th Jan 2021, UTC

బోస్టన్ :సాధారణంగా మనం రోజుకు ఒక డ్రెస్ మార్చేస్తాం. ఎప్పుడైనా అవసరం ఐతే తప్ప ఏ డ్రెస్ ను వరుసగా రెండు రోజులకు మించి వేసుకోము. ఒకసారి వేసుకున్నాక, వాటిని తీసివేసి ఉతుక్కున్నాక కానీ మళ్ళీ వేసుకోము. రోజు కో వెరైటీ వేసుకోవడానికి ఇష్టపడతాం. అలాంటిది రోజు ఒక్కటే డ్రెస్ వేసుకోవాలంటే అయ్యే పనేనా? కానీ ఒక అమ్మాయి చేసి చూపించింది. అమెరికాకు చెందిన ఓ మహిళా వంద రోజులు ఒకటే డ్రెస్ వేసుకుని ఇపుడు నెట్టింట్లో ప్రశంసలు పొందుతోంది.

అమెరికాకు చెందిన బోస్టన్ లో 52  సంవత్సరాల సారా రాబిన్స్ అనే మహిళ గతేడాది సెప్టెంబర్ నుంచి నిన్నటి వరకు బ్లాక్ మెరినో ఊల్ డ్రెస్ ను వేసుకుంది. ఫ్యాషన్ లకు దూరంగా ఉంటూ, సాధారణ జీవితం గడుపుతూ ఆమె ఇలా వందరోజులు ఒకటే డ్రెస్ ను వేసుకుంది. ఆమె ఒకే డ్రెస్ ను వంద రోజులు వేసుకునే ఛాలెంజ్ ను స్వీకరించింది. ఈ ఒక్క డ్రెస్ వేసుకుని ఆమె కేవలం ఇంట్లోనే కాదు, చర్చి కి, ఉద్యోగానికి కూడా వెళ్ళేది.

ఇటీవల, క్రిస్టమస్ కు కూడా ఆమె అదే డ్రెస్ వేసుకుని సెలెబ్రేట్ చేసుకుంది. ఈ వందరోజుల ఛాలెంజ్ ను ఆమె ఓ డాక్యుమెంటరీ లా తీసి సోషల్ మీడియాలో మినీ సెలబ్రిటీ అయిపొయింది. అయితే, ఈ డ్రెస్ పై ఆమె రంగు రంగుల జాకెట్ లను మార్చుకునేది. అయితే, ఈ డ్రెస్ ఛాలెంజ్ ను చాలా మంది తీసుకున్నారు. "ఉల్ అండ్" కంపెనీ "రోవేనా స్వింగ్ డ్రెస్" ను తయారు చేసింది. సాదా సీదాగా జీవించేవారు, దుస్తులను జాగ్రత్తగా వాడుకునే వారు, మంచిగా చూసుకోవడం తెలిసిన వారికి మాత్రమే వారు ఈ వంద రోజుల ఛాలెంజ్ ను ఇస్తున్నారు. ఈ ఛాలెంజ్ ను స్వీకరించిన 50 మందికి మాత్రమే వారి కంపెనీ రూపొందించిన దుస్తులను ఇస్తారు. ఈ ఛాలెంజ్ ను స్వీకరించిన సారా వంద రోజుల పాటు ఒకే డ్రెస్ ను వేసుకుంది. మరిన్ని వార్తలు చదవండి 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox