Breaking News

మొక్కలు నాటడం మత వ్యతిరేకమని 6 వేల మొక్కల పీకివేత..!

12 th Aug 2020, UTC

పాకిస్థాన్ : అర్ధం పర్ధం లేని వాదనలు ఎంతో కీడుని కలిగిస్తాయి. అలాంటిదే ఇది కూడా పాకిస్థాన్ లో ఓ చోట, మొక్కలు నాటడం మతానికి వ్యతిరేకమైన పని అని దాదాపు ఆరువేల మొక్కలను పీకి అవతల పారేసిన ఘటన చోటు చేసుకుంది. పాకిస్థాన్ లో పర్యావరణ పరిస్థితి అంతంత మాత్రమే పర్యావరణాన్ని పెంపొందించడానికి ఇమ్రాన్ ఖాన్ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు.

అయితే మొక్కలు నాటడం మతానికి వ్యతిరేకం అని మొక్కలను పీకి పడేసిన ఘటన పాకిస్థాన్ లోని ఖైబర్ రాష్ట్రంలో జరిగింది. ఇమ్రాన్ ఖాన్ పిలుపు మేరకు దేశ వ్యాప్తంగా ఆదివారం నాడు  35 లక్షల మొక్కలను నాటారు. మొక్కలను నాటిన గంటల వ్యవధిలోనే ఖైబర్ రాష్ట్రంలోని మండికాస్ జిల్లాలో కొందరు వాటిని పీకి పడేసారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు  సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అయితే ఇలాంటి ఘటనపై పర్యావరణ ప్రేమికులు విచారం వ్యక్తం చేసారు. ఈ విషయమై ఖైబర్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆగ్రహించారు. ఇలా మొక్కలను పీకిన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox