Breaking News

ఫేస్ మాస్క్‌లతో వెడ్డింగ్ గౌన్

21 st Jul 2021, UTC
ఫేస్ మాస్క్‌లతో వెడ్డింగ్ గౌన్

లండన్ :మహమ్మారి నేపధ్యంలో ఫేస్ మాస్క్‌లు మరియు హ్యాండ్ శానిటైజర్లు నిత్యజీవితంలో భాగంగా మారాయి. అదే సమయంలో ఉపయోగించనిఫేస్ మాస్క్‌ల సంఖ్య ప్రతి రోజు పెరుగుతుంది. యూకేలో ఒక డిజైనర్ విస్మరించిన ఫేస్ మాస్క్‌లను ఉపయోగించి  వెడ్డింగ్ గౌను తయారు చేశారు. వెడ్డింగ్ గౌన్  1,500 వైట్ ఫేస్ మాస్క్‌లతో తయారు చేయబడింది. డిజైనర్ టామ్ సిల్వర్‌వుడ్ వెడ్డింగ్ ప్లానర్ వెబ్‌సైట్ ‘హిచ్డ్’ సహకారంతో గౌను తయారు చేశారు.

మోడల్ జెమిమా హంబ్రో లండన్లోని సెయింట్ పాల్స్ కేథడ్రల్ సమీపంలో అందమైన తెల్లని వివాహ గౌను ధరించి ఫోటోషూట్ దిగారు. ప్రతి వారం  యూకేలో 100 మిలియన్ల డిస్పోజబుల్ మాస్క్ లు విసిరివేయబడతాయని హిచ్డ్ లో పేర్కొన్నారు. ఇంగ్లాండ్‌లోవివాహాలపై కోవిడ్ ఆంక్షల ముగింపు సందర్బంగా కూడ ఈ గౌన్ తయారు చేసినట్లు పేర్కోన్నారు. హిచ్డ్ సంపాదకుడు సారా అలార్డ్ మాట్లాడుతూ ఈ రోజు నుండి చట్టపరమైన పరిమితులు లేకుండా వివాహాలు ఇంగ్లాండ్‌లో తిరిగి జరుగుతాయని మేము చాలా సంతోషిస్తున్నాము. ఈ వేసవిలో వేలాది వివాహాలు జరగనున్నందున, జంటలు ఇప్పుడు డ్యాన్స్ ఫ్లోర్‌లను తిరిగి తెరవడం, నిలబడి పానీయాలు కోసం ఎదురు చూడటం కనపడతాయి. అదేవిధంగా పిపిఇ పరిమితులు లేకుండా నవ్వుతున్న రిసెప్షన్‌లు మరియు  ఫోటోలు వుంటాయని పేర్కొన్నారు.

అయినప్పటికీ, మహమ్మారి ఫలితంగా ఏర్పడిన సమస్యను మేము విస్మరించలేము. ఉపయోగించని మాస్క్ లను  సద్వినియోగం చేయడం ద్వారా మనం ఎంతదూరం వచ్చామనేది చెబుతామని అలార్డ్ అన్నారు. మరిన్ని వార్తలు చదవండి 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox