Breaking News

ట్రంప్ ఖాతా తొలగించినందుకు ట్విట్టర్ కు ఎంత నష్టమో తెలుసా..?

12 th Jan 2021, UTC

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖాతాను ట్విట్టర్ మాధ్యమం శాశ్వతంగా తొలగించిన సంగతి తెలిసిందే. హింసను ప్రేరేపించే విధంగా డోనాల్డ్ ట్రంప్ ట్వీట్ లు చేస్తున్నారని, అందుకే ఆయన ఖాతాను తొలగిస్తున్నామని ట్విట్టర్ పేర్కొంది. అయితే, దీనివల్ల ట్విట్టర్ కు భారీగానే నష్టం వాటిల్లింది. ట్విట్టర్ ఖాతాను క్లోజ్ చేస్తున్నట్లు ప్రకటన చేయడంతో సోమవారం ఒక్కరోజే ట్విట్టర్ షేర్ పన్నెండు శాతం పడిపోయింది. సంస్థ మార్కెట్‌ క్యాపిటలైజేషన్ ఐదు బిలియన్ డాలర్ల వరకు ఆవిరి అయిపొయింది. 

ట్రంప్ ఖాతాలనే కాకుండా, ట్రంప్ కు మద్దతు తెలుపుతున్న వారి ఖాతాలను కూడా ట్విట్టర్ తొలగించింది. దాదాపు డెబ్భై వేల ఖాతాలను ట్విట్టర్ తొలగించిందని సమాచారం. ట్రంప్ కు దాదాపు  88 మిలియన్ల మంది ఫాలోవర్స్‌ ఉన్నారు. అమెరికా లో కాపిటల్ ఘటన దుమారం లేపిన సంగతి విదితమే. ఆ తరువాతే ట్విట్టర్ ఈ నిర్ణయం తీసుకుంది. మరో సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ కూడా ట్విట్టర్ మార్గం లోనే పయనిస్తోంది. మరిన్ని వార్తలు చదవండి

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox