Breaking News

అబ్ర‌హం లింక‌న్ త‌ర్వాత నేనే:డొనాల్డ్ ట్రంప్

13 th Jun 2020, UTC
అబ్ర‌హం లింక‌న్ త‌ర్వాత  నేనే:డొనాల్డ్  ట్రంప్

అగ్ర‌రాజ్యం అమెరికాలో ఒక‌వైపు మ‌హ‌మ్మారి క‌రోనా విల‌య‌తాండ‌వం చేస్తుంటే... . మరో వైపు  న‌ల్ల‌జాతీయుల ఆందోళ‌న‌లు జోరందుకున్నాయి. శ్వేతజాతి పోలీసుల చేతిలో బలైన నల్లజాతీయుడు జార్జి ఫ్లాయిడ్‌ మృతికి అమెరికాతో పాటు ప్రపంచంలోని పలు దేశాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి.

 మియామి, రిచ్‌మండ్‌, వర్జీనియా, సెయింట్‌ పాల్‌, మిన్నెసొటా, బోస్టన్‌ నగరాల్లోని నరమేధం, బానిసత్వాలను ప్రోత్సహించిన నాయకులు, రాజుల విగ్రహాలను నిర‌స‌న‌కారులు ధ్వంసం చేశారు. న‌ల్ల‌జాతీయుల ఆగ్ర‌హ‌జ్వాల‌లతో అగ్ర‌రాజ్యం అతలాకుతలం అవుతోంది.

ఇదిలా ఉంటే... తాజాగా అధ్య‌క్షుడు డొనాల్డ్ మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. శుక్ర‌వారం ప్ర‌ముఖ న్యూస్ ఛానెల్‌తో మాట్లాడిన ట్రంప్‌... అమెరికాలోని న‌ల్ల‌జాతీయుల శ్రేయ‌స్సు కోసం తానెంతో కృషి చేశాన‌ని చెప్పారు. వారి ప్ర‌గ‌తి కోసం పాటుప‌డిన యూఎస్ అధ్యక్షుల్లో అబ్ర‌హం లింక‌న్ త‌ర్వాత తాను రెండో స్థానంలో ఉంటాన‌ని అన్నారు.

న‌ల్ల‌జాతీయులు చ‌దువుకునే క‌ళాశాలు, విశ్వ‌విద్యాల‌యాల‌కు ఇంత‌కుముందెన్న‌డూ లేని విధంగా భారీ మొత్తంలో నిధులిచ్చి ప్రోత్సాహించాన‌ని తెలిపారు. అంతేగాక త‌క్కువ ఆదాయం ఉన్న వారు బిజినెస్ చేసుకునేందుకు ప‌లు ప‌న్ను మిన‌హాయింపులు ఇచ్చాన‌ని ట్రంప్ గుర్తు చేశారు. ఇక రెండోసారి అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగుతున్న ట్రంప్‌... ఒక్లహామాలో ఈ నెల 19న జరిపే ర్యాలీతో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. 

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox