Breaking News

టీకా అందరికి ఇస్తాం : డోనాల్డ్ ట్రంప్

30 th Jul 2020, UTC
టీకా అందరికి ఇస్తాం : డోనాల్డ్ ట్రంప్

వాషింగ్టన్‌ : కరోనా మహమ్మారి వచ్చిన తరువాత మానవ జీవితం లో పెను మార్పులు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. కరోనా కి ముందు కరోనా కి తరువాత అన్నట్లు గా పరిస్థితులు మారిపోయాయి. అయితే ఈ మహమ్మారి కారణంగా స్తంభించిపోయిన జీవన వ్యవస్థ ఇపుడిపుడే ప్రారంభం అవుతోంది. అయితే కరోనా బెడద పూర్తి  గా పోనప్పటికీ ప్రజలు ధైర్యం చేసి పనులు ప్రారంభిస్తున్నారు.
          అయితే పెరుగుతున్న కరోనా కేసులు మరణాలు ఓ వైపు ఆందోళన రేకెత్తిస్తూనే ఉన్నాయి. వాక్సిన్ ను తీసుకురావడానికి వివిధ దేశాల శాస్త్రవేత్తలు కుస్తీలు పడుతున్నారు. అయితే ఈ టీకా తయారీ లో ముందు వరస లో ఉన్న అమెరికా ఇతర దేశాలకు కూడా టీకాను అందించేందుకు సిద్ధం గా ఉంటుందని  అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తెలిపారు.  అత్యధిక కేసులతో సతమతమవుతున్న అమెరికా, కొవిడ్ వ్యాక్సిన్ కోసం విశ్వప్రయత్నాలు  చేస్తున్న సంగతి తెలిసిందే.
         టీకా తయారు చేసిన తరువాత ఇతర దేశాలకు కూడా అందించడానికి వేగం గా ఉత్పత్తి ప్రారంభిస్తామని ట్రంప్ చెప్పుకొచ్చారు. కరోనా చికిత్సకు ఉపయోగపడే వెంటిలేటర్లు సరఫరా చేసినట్లే టీకాను కూడా ఇతర దేశాలకు అందిస్తామని మంగళవారం ఆయన మీడియా సమావేశంలో తెలిపారు.  అన్ని అనుకున్నట్లు పూర్తి అయితే. ఈ ఏడాది చివరికి అందిస్తామని చెప్పుకొచ్చారు. మరిన్ని వార్తలు చదవండి. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox