Breaking News

టీఆర్‌ఎస్ తుగ్లక్ పార్టీ.. ఎంఐఎం తాలిబన్ పార్టీ బండి సంజయ్

11 th Sep 2021, UTC

 టీఆర్‌ఎస్, ఎంఐఎం పార్టీలపై బీజేపీ నేత బండి సంజయ్ మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌  తుగ్లక్ పార్టీ, ఎంఐఎం  తాలిబన్ పార్టీ అంటూ ధ్వజమెత్తారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ హుజురాబాద్‌ ఉపఎన్నిక కోసమే దళితబంధు ప్రకటించారని ఆరోపించారు. ప్రభుత్వం మెడలు వంచైనా సెప్టెంబర్ 17ను నిర్వహించేలా చేస్తామని స్పష్టం చేశారు. కేంద్రం రూ.లక్షల కోట్ల నిధులు రాష్ట్రానికి ఇస్తోందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వంపై టీఆర్ఎస్‌ నేతలు అనవసర ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు.

తెలంగాణ కోసం 1400 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని  బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు.  ఇప్పుడు కేసీఆర్ కుటుంబములో అందరికి ఉద్యోగాలు వచ్చాయన్నారు. . ముఖ్యమంత్రి అంబేద్కర్ జయంతికు, వర్ధంతిలకు రాడు, దళిత సంఘాలు ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. ఢిల్లీలో ఉన్న, ఇక్కడ ఉన్న కేసీఆర్ పీకెది ఏమి లేదన్నారు. నిజమైన ఉద్యమకారుడు  కాళోజీ అన్నారు.  కేసీఆర్ ఉంటే  ఫామ్ హౌస్, లేదంటే ప్రగతి భవన్‌లో  వుంటాడని ఎద్దేవా చేసారు.

సీఎం ఫామ్ హౌస్‌లో ఉన్న కుక్కకి ఉన్న విలువ పేదలకు లేదా? అని ఆయన ప్రశ్నించారు. ఈ  మూర్కుడి కొడుకు గ్లోబరిన్ సంస్థ వలన ఇంటర్మీడియట్ విద్యార్థులు చనిపోయారని చెప్పారు. సీఎం ఎన్నికలు వస్తే కోతలు కోస్తాడు, ఊక దంపుడు ఉపన్యాసాలు ఇస్తాడని బండి సంజయ్  విమర్శించారు.

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox