Breaking News

ట్రంప్ వైట్ హౌస్ వీడిన వేళ.. టిఫనీ ట్రంప్ నిశ్చితార్ధం..!

20 th Jan 2021, UTC

వాషింగ్టన్ :అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చిన్న కుమార్తె టిఫనీ వివాహం నిశ్చితార్థం చేసుకున్నారు. ఇటీవల జార్జ్‌టౌన్ లా స్కూల్ గ్రాడ్యుయేట్ అయిన 27 ఏళ్ల టిఫనీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో మంగళవారం ఈ శుభవార్త ప్రకటించింది. ఆమె తన మరియు కాబోయే భర్త మైఖేల్ బౌలోస్ యొక్క ఫోటోను వైట్ హౌస్ వద్ద వెస్ట్ వింగ్ కాలొనేడ్లో చూపించింది.

"వైట్ హౌస్ మైదానంలో నాకెన్నో మధురమైన జ్ఞాపకాలున్నాయి. ఇక్కడ మైదానంలో నా కుటుంబంతో గడిపిన జ్ఞాపకాలు నాకెంతో ప్రత్యేకం. ఇదే ప్లేస్ లో నా నిశితార్థం జరిగిన మధురానుభూతి కంటే మరేదీ ప్రత్యేకమైనది ఏదీ లేదు! ” అని టిఫనీ ట్రంప్ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో పేర్కొన్నారు. 

"ఆ దేవుని ఆశీర్వాదాలు మా పై ఉంటాయి. నా జీవిత ప్రేమతో నిశ్చితార్థం జరిగింది. జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభించడానికి ఉత్సాహంగా ఉందని" 23 ఏళ్ల బిజినెస్ ఎగ్జిక్యూటివ్ బౌలోస్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పేర్కొన్నారు. డోనాల్డ్ ట్రంప్ రెండవ భార్య కుమార్తె టిఫనీ ట్రంప్. ఆమె మరియు బౌలోస్ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వైట్ హౌస్ లో పలు కార్యక్రమాలకు కూడా కలిసి హాజరు అయ్యారు. మరిన్ని వార్తలు చదవండి

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox