Breaking News

మహిళలకు ఆర్మీలో పనిచేసే అవకాశం కువైట్ కీలక నిర్ణయం

13 th Oct 2021, UTC

గల్ఫ్ దేశం కువైట్  మహిళలు  ఆర్మీలో పనిచేసేందుకు అవకాశం కల్పించింది. ఈ మేరకు మంగళవారం కీలక ప్రకటన చేసింది. కువైత్ నేషనల్ మిలిటరీ సర్వీస్‌లో మహిళల కోసం కూడా రిజిస్ట్రేషన్లు ప్రారంభించాలని ఆర్మీ అధికారులకు ఆ దేశ ఉప ప్రధాని, రక్షణ మంత్రి షేక్ హమద్ జాబెర్ అల్ అలీ అల్ సబా ఆదేశించారు.

కువైట్ మహిళలు అనేక రంగాలలో తమ విజయాలను నిరూపించుకున్నారు. దీనితో  పురుషులతో పాటు మహిళలు మిలిటరీ కార్ప్స్‌లోకి ప్రవేశించడానికి ఆమోదం లభించింది.గత రెండు దశాబ్దాలుగా, కువైట్ మహిళలు పోలీస్ అధికారులుగా  సేవలందిస్తున్నారు. ఈ రెండు దశాబ్దాల ప్రయాణం ఇప్పుడు దేశంలోని జాతీయ సైనిక సేవల్లో చేరడానికి మహిళలకు కొత్త మార్గాలను సుగమం చేసిందని సబా అన్నారు

కువైట్ గత కొన్నేళ్లుగా పురుషులు ఎక్కువగా ఆధిపత్యం చెలాయించే వివిధ రంగాలలో, మహిళలకు పని చేసే హక్కును అందించడంలో గణనీయమైన పురోగతిని సాధిస్తోంది. అంతకుముందు 2005 లో, దేశం మహిళలకు ఓటు హక్కు మరియు కార్యాలయాన్ని నిర్వహించే హక్కును కల్పించే బిల్లును ఆమోదించింది. 

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox