Breaking News

బైడెన్ అధ్యక్ష ప్రసంగాన్ని రాసింది మన తెలుగు వ్యక్తే..!

21 st Jan 2021, UTC

వాషింగ్టన్ :భారత్ కాలమానం గత రాత్రి పదిన్నర గంటల సమయంలో జో బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసారు. ఈ సందర్భంగా జో బైడెన్ ప్రసంగించారు. ఈ ప్రసంగాన్ని రాసిందెవరో వ్యక్తి. తెలుగు వ్యక్తి వినయ్ రెడ్డి. అమెరిక అధ్యక్ష ప్రసంగాన్ని రాసిన తొలి భారతీయ వ్యక్తి గా వినయ్ రెడ్డి రికార్డు సృష్టించారు. ఈ ప్రసంగంలో వినయ్ రెడ్డి ఎన్నికల సమయంలో జో బైడెన్ ఇచ్చిన హామీల గురించి ప్రస్తావించారు.

2013-17 మధ్య బైడెన్ ఉపాధ్యక్షుడిగా పని చేస్తున్న సమయంలో కూడా వినయ్ రెడ్డి జో బైడెన్ కు ప్రసంగ రచయితగా ఉన్నారు. ప్రస్తుతం వినయ్ ఒహియోలోని డేటన్‌లో నివసిస్తున్నారు. బైడెన్ ప్రభుత్వంలో చాలా మంది భారతీయులు ఉన్నారు. ఇరవై మందికి పైగా భారతీయ సంతతి వున్నారు. వీరిలో 13 మందికి పైగా మహిళలు ఉన్నారు. వీరిలో మొత్తం 17 మంది వైట్ హౌస్ లోనే తమ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. గతంలో అమెరికా ప్రభుత్వం లో ఒక శాతం మాత్రమే భారతీయ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులకు పదవులు దక్కేవి. ఈసారి ఎక్కువ సంఖ్యలో పదవులు దక్కడం విశేషమే. మరిన్ని వార్తలు చదవండి 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox