Breaking News

శ్రీలంక ప్రధానమంత్రిగా రనిల్‌ విక్రమసింఘే

13 th May 2022, UTC

SriLanka: శ్రీలంకలో సీనియర్‌ రాజకీయ నాయకుడు రనిల్‌ విక్రమ సింఘేను తదుపరి ప్రధానమంత్రిగా అధ్యక్షుడు గొటబాయ రాజపక్స నియమించారు.  శ్రీలంకలో అతి పెద్ద ప్రతిపక్ష పార్టీ  రాజపక్సతో చేతులు కలపడానికి సిద్దంగా లేకపోవడంతో ఇప్పటి వరకు నాలుగుసార్లు ప్రధానమంత్రిగా పనిచేసిన రనిల్‌ ఒక్కరే ప్రత్యమ్నాయంగా కనిపించారు. 

శ్రీలంక పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. రాజపక్స కుటుంబం గద్దె దిగాలని పెద్ద ఎత్తున ఉద్యమం చెలరేగడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రధానమంత్రి పదవికి మహింద రాజపక్స రాజీనామా చేయాల్సి వచ్చింది. కాగా ఆందోళన కారులు అధ్యక్షుడు గొటబాయ కూడా రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

మహింద రాజపక్స రాజీనామా చేసిన తర్వాత రనీల్‌ విక్రమసింఘేతో  పలుమార్లు చర్చలు జరిపినట్లు చెబుతున్నారు. ప్రధానమత్రి పదవికి పలువురి పేర్లు తెరపైకి వచ్చినా, చివరకు రనిల్‌నే  గొటబాయ ఎంపిక చేసారు.

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox