Breaking News

రాహుల్ కు ముప్పు వుండదనే మన్మోహన్ ను ఎంపిక చేసారు.. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా

18 th Nov 2020, UTC

వాషింగ్టన్ :అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తాను రాసిన ‘ది ప్రామిస్డ్ ల్యాండ్’పుస్తకంలో పలువురు  ప్రపంచ నాయకుల్లో తాను పరిశీలించిన లక్షణాలను వివరించారు. ఇందులో భాగంగా రాహుల్ గాంధీపై ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం తెలిపిన విషయం తెలిసిందే. తాజాగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురించి ఒబామా ఏం రాసారో బయటకు వచ్చింది.

భారత్ లో 2004 సార్వత్రిక ఎన్నికల తరువాత యూపీఏ కూటమి అధికారంలోకి రాగా ప్రధానిగా మన్మోహన్ సింగ్ ను సోనియా గాంధీ ఎంపిక చేసారు. అయితే మన్మోహన్ ఎన్నిక వెనుక సోనియా స్వప్రయోజనాలు వున్నాయని ఒబామా తన పుస్తకంలో రాసారు. రాజకీయంగా ఎటువంటి పలుకుబడి లేని వృద్ద సిక్కునేత మన్మోహన్ తో తన కుమారుడు రాహుల్ గాంధీకి ఎటువంటి ముప్పు వుండదనే సోనియా ఆయనను ప్రధానిగా ఎంపిక చేసారని ఒబామా అన్నారు. 

ముంబై ఆర్థిక రాజధానిపై ముష్కరులు దాడి చేసిన తరువాత పాకిస్థాన్‌పై ప్రతీకారం తీర్చుకోవటానికి సింగ్ విముఖత చూపడం రాజకీయంగా తనకు నష్టాన్ని చేకూర్చిందని కూడ ఒబామా అన్నారు. ఈ సంయమనం వల్ల మన్మోహన్ రాజకీయంగా మూల్యం చెల్లించారని అన్నారు. 

ఒబామా సోనియాగాంధీ పై కూడ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.ఆమె అరవైలలో ఒక అద్భుతమైన చీర ధరించి, చీకట్లో పరిశోధించే కళ్ళు మరియు నిశ్శబ్దంగా వుండే మహిళగా వర్ణించారు. అమెరికా అధ్యక్షుడి గౌరవార్థం నిర్వహించిన విందులో సోనియా గాంధీ మాట్లాడిన దానికంటే ఎక్కువగా విన్నారని ఒబామా అన్నారు. విధానపరమైన విషయాలు వచ్చినప్పుడు సింగ్‌ను తప్పించడం పట్ల జాగ్రత్తగా ఉన్నారని మరియు తరచూ తన కొడుకు పట్ల సంభాషణను నడిపించారని ఒబామా గుర్తుచేసుకున్నారు. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox