Breaking News

సాఫ్ట్ వేర్ ఉద్యోగులు గుడ్ బై చెబుతున్నారు.. M.Yagnasri

20 th Nov 2021, UTC

అగ్రరాజ్యాన్ని ఉద్యోగస్తులు భయపెడుతన్నారా? కరోనా మాదిరిగానే ద గ్రేట్‌ రిజిగ్నేషన్‌ కూడా ప్రపంచ వ్యాప్తంగా పాకిందా ? ఒకప్పుడు సాఫ్ట్‌వేర్‌ జాబంటే అమెరికాలోనా ..లేక ఏ దేశంలో అని అడిగేవారు.. కాని ఇప్పుడు అలాంటి ఉద్యోగులు అక్కడ ఉద్యోగాన్ని ఎందుకు వదులుకుంటున్నారు? అసలు ద గ్రేట్‌ రిజిగ్నేషన్‌ అంటే ఏమిటి ? 

అమెరికా నుంచి భారత్‌కు పాకిన ఆ కొత్త వైరస్ పేరే  ద గ్రేట్ రెజిగ్నేషన్. సింపుల్ గా చెప్పాలంటే భారీ ఎత్తున ఒక్కరో ఇద్దరో కాదు. ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా లక్షలాది మంది  ఉద్యోగాలు కొద్ది రోజులకే రిజైన్‌ బాట పడుతున్నారు.  ఉద్యోగం కోసం ఆపసోపాలు పడి ఆఫీసుల చుట్టూ చెప్పులు అరిగిపోయేలా తిరుగుతారు.   ప్రస్తుతం ఉద్యోగం ఉన్న వాళ్ళు  ఈ నౌఖరీ  మాకు వొద్దురా బాబూ అని  రాజీనామా చేస్తున్నారు.కరోనా మహమ్మారి వారూ వీరు అని కాదు .. ప్రపంచ వ్యాప్తంగా అందరికి కడుపుకోతను మిగిల్చింది.  ఇక పేద ప్రజల బతుకుదెరువు అగమ్యగోచరంగా మారింది.   చిన్న చిన్న ఉద్యోగుల వెతలు అంతా ఇంతా కాదు.  జాబ్‌ చేయాలా వద్దా.. అని తేల్చుకోలేని పరిస్థితిలోకి వెళ్లి పోయారు.  ఈ సమయంలో కొంతమంది  ద గ్రేట్ రెజిగ్నేషన్ కు తెరలేపారు.  

అమెరికాకు చెందిన ఆంథోనీ క్లోట్జ్ ఒక వ్యాపార వేత్త. ఈయన  బిజినెస్ స్కూల్ ఆఫ్ టెక్సాస్ ఏ అండ్‌ ఎమ్‌  యూనివర్సిటీ లోప్రొఫెసర్ గా పని చేస్తున్నారు.  ఈయన భారీ ఎత్తున ఉద్యోగాల వలస ఉంటుందని   ఇంటర్నేషనల్‌  బిజినెస్‌ మ్యాగజైన్‌ లో   తెలిపారు. అమెరికాలో 2020 డిసెంబర్‌లో  ఉద్యోగుల వలసలు ప్రారంభమయ్యాయి.   యూఎస్‌లో జాబ్‌ చేస్తున్న మిలియన్ల ఉద్యోగులు బతికుంటే బలుసాకు తినచ్చనే చందంగా  ద గ్రేట్‌ రిజిగ్నేషన్‌ ఇచ్చి సొంత దేశాలకు వెళ్లారు.  తాజాగా భారత్‌లో కూడా  ఉద్యోగుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. లాక్‌డౌన్‌లో వసతి, ఆహార, పర్యాటకం, సేవ, ఆరోగ్య సంరక్షణ, విమానం, రిటైల్ , ఇతర చిన్న తరహా పరిశ్రమ వ్యాపార రంగాలకు తీవ్ర నష్టాన్ని చేకూర్చంది.  సిబ్బంది తగ్గింపు.. జీతాల్లో కోత విధించారు. దీంతో  కొత్త ఉద్యోగ అవకాశాలు కల్పించలేకపోయారు.   ఉద్యోగుల తమ కంపెనీకు రాజీనామా చేసి కొత్త కంపెనీల వైపు దృష్టి సారించారు.  అవసరమైతే కెరీర్‌ మార్చుకొనేందుకు సిద్దపడుతున్నారని పలు రిపోర్టులు కూడా వెల్లడించాయి.   ద గ్రేట్ రెజిగ్నేషన్ తో సాఫ్ట్‌వేర్ రంగం లో ఎంప్లాయీస్‌ వలసలు ఊపందుకుంటున్నాయి.మైక్రోసాఫ్ట్ వర్క్ ట్రెండ్ ఇండెక్స్ ప్రకారం ఈ ఏడాది  డిసెంబర్‌ నాటికి ...  ప్రపంచలో 41 శాతం మంది ఉద్యోగులు రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారని గణాంకాలు తెలుపుతున్నాయి. ఇక భారత్‌లో జాబ్ మార్కెట్ పుంజుకునేందుకు పలు కంపెనీలు  ప్రయత్నాలు ప్రారంభించాయి.  జాయినింగ్ బోనస్ లాంటివి ప్రకటించి  ఉద్యోగులకు  ఎర వేస్తున్నాయి. 

ఐటీ ఉద్యోగులు  ఆరంకెల జీతం తీసుకున్నారు. దీంతో పాటు బోనస్‌లు, ఇంక్రిమెంట్లు, స్పెషల్‌ ఆఫర్స్‌ అన్నీ ఇన్నీకావు.  దీన్ని బట్టి ఐటీ ఉద్యోగలుకు మార్కెట్‌లో ఎంత డిమాండ్‌ ఉందో వేరే చెప్పనక్కరలేదు.  అయితే కోవిడ్‌ సమయంలో వర్క్‌ ఫ్రం హోం .. పని ఒత్తిడి... పని గంటలు.. ఇవన్నీ లెక్కలేసుకుంటున్నారు.  ప్రస్తుతం ఏ కేడర్‌లో ఉన్నాం.. అది వారికి ఎంత వరకు గౌరవం అన్నీ ఆలోచించి 40 శాతం మంది ఉద్యోగులు రాజీనామా బాట పడుతున్నారు. టెస్కో ఇండియా,  పీపుల్ డైరెక్టర్  సోమనాథ్ బైశ్య  ఐటీ రంగంలో రాజీనామాలు ఎందుకు ఎక్కువయ్యాయో వివరణ ఇచ్చారు.  గతంలో చేసిన పని విధానాలను పునరాలోచించి ఉద్యోగి విలువలు, ప్రతిపాదలను రూపొందించడానికి, భవిష్యత్ లో కంపెనీలు   గుర్తించడానికి  దోహదపడతాయన్నారు. ఉద్యోగుల కెరీర్ .. వారి నైపుణ్యం పెట్టుబడికి  ఇది ఒక మంచి అవకాశమన్నారు. 

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox