Breaking News

నేపాల్ ప్రధానిగా షేర్ బహదూర్ దేవ్ బా

14 th Jul 2021, UTC
నేపాల్ ప్రధానిగా షేర్ బహదూర్ దేవ్ బా

నేపాలీ కాంగ్రెస్ అధ్యక్షుడు షేర్ బహదూర్ దేవ్ బా నేపాల్ ప్రధానిగా మంగళవారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం షేర్ బహదూర్ దేవ్ బాను ప్రధానిగా నియమించాలని ఆదేశించింది. 146 మంది పార్లమెంటు సభ్యుల సంతకంతో కూడిన ప్రతిపక్ష కూటమి ఈ విషయంలో పిటిషన్ దాఖలు చేసింది.

నేపాలీ కాంగ్రెస్‌కు చెందిన జ్ఞానేంద్ర బహదూర్ కర్కి మరియు బాలకృష్ణ ఖండ్, మరియు నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ (మావోయిస్ట్ సెంటర్) కు చెందిన జనార్దన్ శర్మ మరియు పంపా భూసాల్ కూడా ప్రభుత్వంలో చేరారు. అంతకుముందు  మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలి సుప్రీం తీర్పు సరికాదన్నారు.ప్రపంచంలో ఎక్కడా ఒక ప్రధానిని కోర్టు నియమించలేదన్నారు.

జూన్ 13, 1946న జన్మించిన షేర్ బహదూర్ దేవ్ బా తన విద్యార్థి రోజుల నుంచీ రాజకీయాల్లో చురుకుగా ఉన్నారు. అతను నేపాల్ కాంగ్రెస్ యొక్క విద్యార్థి విభాగమైన నేపాల్ స్టూడెంట్ యూనియన్ అధ్యక్షుడిగా పనిచేశారు. కింగ్ మహేంద్ర నిరంకుశ పాత్రకు వ్యతిరేకంగా నిరసనలలో  పాల్గొని  9 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాడు. దేవ్ బా 1991 లో దాదెల్ధురా 1 నియోజకవర్గం నుండి మొదటిసారి ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు. గిరిజా ప్రసాద్ కొయిరాలా నేతృత్వంలోని ప్రభుత్వంలో హోంమంత్రిగా పనిచేశారు. మరిన్ని వార్తలు చదవండి 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox