Breaking News

యెమన్ జైలుపై సౌదీ వైమానిక దాడి.. 100 మందికి పైగా ఖైదీల మృతి.. పలువురికి గాయాలు

22 nd Jan 2022, UTC

Saudi airstrikes:  యెమన్‌, సౌదీ అరేబియా దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. రెండు దేశాలు ఒకదానిపై మరొకటి వైమానిక దాడులకు తెగబడుతున్నాయి. సౌదీ తాజాగా యెమన్​లోని సాదా జైలుపై వైమానిక దాడికి పాల్పడింది. ఈ దాడుల్లో వంద మందికి పైగా ఖైదీలు మృతి చెందినట్లు యెమన్​లోని రెడ్​క్రాస్​ అంతర్జాతీయ కమిటీ వెల్లడించింది. మరో 100 మంది గాయపడినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రులకు తరలించారు. మృతుల్లో పలువురు చిన్నారులు, ఆఫ్రికా వలసదారులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. తీరప్రాంత నగరం హొడేయిదాలో జరిగిన మరో వైమానిక దాడి నేపథ్యంలో ....యెమన్​లో​ ఇంటర్నెట్ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడినట్లు అధికార వర్గాలు తెలిపాయి.

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ రాజధాని అబుదాబిలోని ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టుపై యెమన్‌ హౌతీ తిరుగుబాటుదారులు ఈ నెల 17న జరిపిన దాడుల్లో ఇద్దరు భారతీయులతో సహా ముగ్గురు మృతి చెందారు. దీనికి ప్రతిగా కొద్ది గంటల్లోనే సౌదీ అరేబియా సంకీర్ణ దళాలు.. హౌతీ తిరుబాటుదారుల ఆధీనంలోని యెమన్‌ రాజధాని సనాపై ఈ నెల 18న వైమానిక దాడులు జరిపాయి. ఈ దాడుల్లో దాదాపు 11 మంది మృతి చెందారు. దీంతోపాటు సౌదీ అరేబియాపైకి ప్రయోగించిన ఎనిమిది డ్రోన్‌లను అడ్డుకున్నట్లు ఈ దళాలు వెల్లడించాయి.

మరిన్ని అంతర్జాతీయ వార్తలు  చదవండి 

 రిపబ్లిక్ వేడుకల సమయంలో విధ్వంసానికి భారీ కుట్ర భగ్నం చేసిన పోలీసులు

 సరోగసీ ద్వారా తల్లయిన ప్రియాంకచోప్రా

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox