Breaking News

టోక్యో పారాలింపిక్స్ బృందంతో ప్రధాని మోదీ

11 th Sep 2021, UTC

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ  గురువారం భారత టోక్యో పారాలింపిక్స్ బృందాన్ని కలుసుకున్నారు.  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కార్యాలయం మోదీని కలుసుకున్న అధ్లెట్ల చిత్రాలను షేర్ చేసింది. పారాలింపిక్స్ 2020 లో పురుషుల సింగిల్స్ బ్యాడ్మింటన్ SL4 కేటగిరీలో రజత పతకం సాధించిన సుహాస్ యతిరాజ్, స్వర్ణం గెలిచిన   కృష్ణ నాగర్ ,మిక్స్‌డ్ డబుల్స్‌లో రజత పతకం సాధించిన పాలక్ కోహ్లీ లతో మోదీ మాట్లాడారు. అందరినీ పలకరించిన మోదీ భవిష్యత్తులో కూడ మరింత మెరుగైన ప్రదర్శన చేయాలని వారిని కోరారు. 

బుధవారం కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ భారత పారాలింపిక్స్ బృందంలో పతక విజేతలను సత్కరించారు, ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం క్రీడాకారులకు లక్ష్యంగా సదుపాయాలను మెరుగుపరచడం  కొనసాగుతుందని ట్వీట్ చేశారు. .అథ్లెట్ల పనితీరు అసాధారణంగా ఉందని పేర్కొంటూ  ప్రశంసించారు.

పారాలింపిక్ క్రీడల్లో టీమ్ ఇండియా అత్యుత్తమ ప్రదర్శనతో ఐదు స్వర్ణాలు, ఎనిమిది రజతాలు మరియు ఆరు కాంస్యాలతో సహా 19 పతకాలు సాధించింది. 1968 లో పారాలింపిక్స్‌లో మొదటిసారి కనిపించినప్పటి నుండి, 2016 రియో ​​వరకు భారతదేశం 12 పతకాలు సాధించింది. టోక్యో పారాలింపిక్స్ 2020 లో మాత్రమే పతకాల సంఖ్య  భారీగా  పెరిగింది.  162 దేశాల్లో భారతదేశం మొత్తం పతకాల జాబితాలో 24 వ స్థానంలో నిలిచింది.

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox